"వైఎస్ దానకర్ణుడు.. చంద్రబాబుది సొల్లు తప్ప అవుట్ పుట్ ఏముండదు"
గంటల కొద్ది మీటింగ్‌లు పెట్టే చంద్రబాబు వల్ల అవుట్ పుట్ మాత్రం ఉండదని, సొల్లు కబుర్లు చెప్పడానికే ఆయన నటిస్తారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. ఇంచుమించుగా వైఎస్ దానకర్ణుడి లాంటివారేనని ప్రశంసించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నాయకుడు వైఎస్ అని, నిత్యం ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.
మరో దివంగత సీఎం ఎన్టీఆర్ కూడా గొప్ప వ్యక్తి అని ముద్రగడ పేర్కొన్నారు. వైఎస్, ఎన్టీఆర్ మినహా వేరే సీఎంలెవరూ తనను అంతగా ఆకట్టుకోలేదని తన మనసులో మాట చెప్పారు. ఇక ప్రస్తుత సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. ఆయన్ను ఎద్దేవా చేసేలా వ్యాఖ్యలు చేశారు.

గంటల కొద్ది మీటింగ్‌లు పెట్టే చంద్రబాబు వల్ల అవుట్ పుట్ మాత్రం ఉండదని, సొల్లు కబుర్లు చెప్పడానికే ఆయన నటిస్తారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. చెప్పిందే చెప్పడం చంద్రబాబుకు అలవాటు అని వ్యాఖ్యానించారు. ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు సర్కార్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముద్రగడ పద్మనాభం.. త్వరలోనే పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. తుని సభ తర్వాత మరోసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్మించాలని ఆయన భావిస్తున్నారు.
ఇందుకోసం ఆయన స్వస్థలం కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్రకు సిద్దమయ్యారు. ఈ పాదయాత్ర తర్వాతైనా ప్రభుత్వంలో చలనం వస్తుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications