వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్య పరీక్షలకు ముద్రగడ ఓకే, కానీ మెలిక: మధ్యవర్తి బీజేపీ ఎమ్మెల్యే!

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించినట్లు రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బుధవారం నాడు తెలిపారు. జేఏసీ సభ్యులుగా తాము పలు దఫాలుగా ముద్రగడతో చర్చలు జరిపామన్నారు.

ముద్రగడ ఎఫెక్ట్, చంద్రబాబు వ్యూహం: పవన్ కళ్యాణ్ గట్టెక్కించేనా?

సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ముద్రగడకు వివరించామని, దీంతో శరీరంలోకి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు ఆయన అంగీకారం తెలిపారన్నారు. అయితే ఆయన దీక్ష మాత్రం కొనసాగుతోందని తెలిపారు.

mudragada

తుని ఘటనపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆకుల అన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారికి బెయిల్‌ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. చర్చలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందన్నారు.

5ని.ల్లో ఇలా.. పరిష్కరించొచ్చు: ఉండవల్లి, మరింత క్షీణించిన ముద్రగడ ఆరోగ్యం

ముద్రగడతో తాము, కాపు జేఏసీ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపామన్నారు. అరెస్టయిన పదిహేడు మందికి బెయిల్, సీబీసీఐడీ విచారణ నిలిపివేతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాగా, తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేయాలంటూ గత ఏడు రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Kapu leader Mudragada Padmanabham ready to health check up on Seventh day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X