'చంద్రబాబుపై కేసు పెడితే.. అలా చేయడానికి నేను సిద్దం'
తూర్పు గోదావరి : ఓవైపు హైకోర్టు అనుమతులిచ్చినా.. ప్రభుత్వం మాత్రం ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో జాప్యం చేస్తూ వస్తున్న ప్రభుత్వంపై.. కాపు నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా అది మరింత రెట్టించే అవకాశముంది.
తాజాగా అనకాపల్లి రైల్వే కోర్టుకు హాజరవ్వాలంటూ ముద్రగడకు నోటీసులు అందడంతో.. ముద్రగడ వర్సెస్ ప్రభుత్వ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నోటిసులపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రగడ. తాటాకు చప్పుళ్లకు జడిసేది లేదని తేల్చి చెప్పారు. పుష్కరాల్లో జరిగిన ప్రాణ నష్టంపై సీఎం చంద్రబాబు మీద కేసు నమోదు చేస్తే.. తమకు సంబంధం లేకపోయినా తునికి ఘటనకు బాధ్యత వహించడానికి సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు.

ఒకవేళ డీజీపీ అలాంటి నిర్ణయమే గనుక తీసుకుంటే.. తన సొంత ఆస్తులు అమ్మి అయినా సరే తుని ఘటనకు నష్ట పరిహారం చెల్లిస్తానని సవాల్ విసిరారు ముద్రగడ. కేవలం కాపుల విషయంలోనే ప్రభుత్వానికి ఆంక్షలు, నిబంధనలు గుర్తొస్తున్నాయని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్-30 జీవిత కాలం అమలులో ఉంటుందా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications