వర్మ బ్లాక్ మెయిలర్-వైసీపీతో టచ్ లో- ముద్రగడ కూతురి షాకింగ్..!

ఏపీలో గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటులో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ నేత ఎస్వీఎన్ఎస్ వర్మకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చినా వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి మాత్రం రాలేదు. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారనే ప్రచారం పిఠాపురంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె, జనసేన నాయకురాలు క్రాంతి బార్లపూడి స్పందించారు. వర్మకు ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారన్న ప్రచారానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిపై వర్మ టీడీపీతోనే తేల్చుకోవాలని, ఇందులో పవన్ కు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చిచెప్పేశారు. అంతే కాదు వర్మ అసంతృప్తిపై ఎదురుదాడి చేసేలా క్రాంతి తన ట్వీట్ లో వ్యాఖ్యలు చేశారు.

mudragada s daughter Kranti sharp attack on pithapuram varma blackmailer in touch with ysrcp

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం కారణం కాదని క్రాంతి తేల్చిచెప్పేశారు. అది టీడీపీ
సొంత వ్యవహారం అన్నారు. మీరూ మీరు తేల్చుకోవాలని సూచించారు. ఈ విషయంలో జనసేన పార్టీపై అక్కసు వెళ్లగక్కడం ఎంత మాత్రం తగదన్నారు. బహుశా మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు నచ్చక, ముఖ్యమంత్రి మిమ్మల్ని పక్కన పెట్టారని ఎందుకు అనుకోకూడదంటూ ప్రశ్నించారు.

Take a Poll

రోగం ఒకటి అయితే మందు ఒకటి వేసిన చందంగా మీ పార్టీ మీకు ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోకుండా జనసేనను ఆడిపోసుకోవడం తగునా అంటూ వర్మను క్రాంతి ప్రశ్నించారు. మీరు చేసే చర్యల వలన ప్రజలకు నష్టం కలిగిస్తున్నారని ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలే కూటమి మధ్య ఐఖ్యత విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వైసీపీకి మీ చర్యలు దోహదం చేసేలా ఉన్నాయని అన్పించడం లేదా ? ఇప్పటికే మీరు వైసీపీ లోకి వెడతారని, ఆ పార్టీ వాళ్ళతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నారు. అందుకు తగ్గట్టుగానే వైసిపి మీడియాలో మిమ్మల్ని హైలెట్ చేస్తూ కథనాలు రావడం నిజం కాదా? అని ప్రశ్నించారు.

వైసిపి రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించాడనికి భేషరతుగా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారని, బీజేపీని కూడా కూటమిలోకి చేర్చారని క్రాంతి తెలిపారు. టికెట్ల విషయంలో కూడా తగ్గి వ్యవహరించారన్నారు. ఫలితంగా ఎన్నో విమర్శలకు గురయ్యారన్నారు. అయినా సంయమనం కోల్పోలేదు సరికదా, కార్యకర్తలను విజయం వైపు అడుగులు వేయించారన్నారు. మీరొక్కరే త్యాగం చేయలేదండి.. జనసేన, టిడిపి, బిజెపిల్లో చాలామంది త్యాగాలు చేసారని తెలిపారు. కూటమి విజయం లక్ష్యంగా అందరూ పనిచేయబట్టే, అనూహ్య విజయాలు, అద్భుత మెజార్టీలు వచ్చాయన్నారు.

ఒకపక్క పదవి రాలేదని, మరోపక్క పవన్ కళ్యాణ్ సుస్థిరస్థానం ఏర్పరచుకుంటే తనకు ఇబ్బందేనని భావించి వర్మ కొన్ని అడ్డంకులు సృష్టించే పనులు గానీ చేస్తున్నారా అన్పిస్తోందని క్రాంతి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వలన పిఠాపురం అనూహ్య అభివృద్ధికి నోచుకుంటోందని, వర్మ ఫిక్స్ అయిపోండని తెలిపారు. పిఠాపురం ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ కి సుస్థిర స్థానం ఖాయమన్నారు. ఇక చంద్రబాబు నాయుడును కూడా కార్యకర్తలచేత తిట్టిస్తున్నారని, అలాంటప్పుడు మీకు పదవి ఎందుకు ఇస్తారండి, ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారండీ అంటూ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+