ముద్రగడ పేరు మార్పు - ప్రభుత్వం గజెట్ జారీ..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ తన పేరు మార్చుకున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసారు. ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. దీంతో, జనసైనికులు ముద్రగడ పేరు మార్పు పైన ప్రశ్నించారు. ఆ సమయంలోనే తాను పేరు మార్పు దిశగా దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వ గజెట్ జారీ చేసింది.
ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అంతకు ముందు జనసేనలో చేరే ప్రయత్నం జరిగింది. వపన్ తో కలిసి పని చేయటానికి సిద్దమని ముద్రగడ చెప్పుకొచ్చారు. కానీ, ముద్రగ ఇంటికి పవన్ వస్తారనే ప్రచారం జరిగినా సాధ్యపడలేదు. దీంతో, జనసేనలో చేరకూడదని నిర్ణయించిన ముద్రగడతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఫలితంగా ఆయన వైసీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసారు. పవన్ ను ఓడిస్తానని శపథం చేసారు.

పిఠాపరంలో తనకు ఉన్న పరిచయాలతో గ్రామ గ్రామాన పర్యటన చేసారు. పవన్ పైన తీవ్ర విమర్శలు చేసారు. పవన్ కు పిఠాపురం కు ఏం సంబంధం అని నిలదీసారు. పవన్ ను ఓడించలేకపోతే తాను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని శపథం చేసారు. ఎన్నికల్లో పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో, ముద్రగడ పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాయి. పేరు మార్పుకు వీలుగా అధికారిక ప్రక్రియకు ముద్రగడ దరఖాస్తు చేసారు. తాజాగా ముద్రగడ పేరును పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం నుంచి గజెట్ జారీ అయంది.












Click it and Unblock the Notifications