స్వామి కుమార్తె పోలీసులపై వీరంగం, సభలో నవ్వులు
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఓ యువతి పోలీసులపై వీరంగం చేసింది. ముక్కామల స్వామి కుమార్తె హర్షిత వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై ఆమె అగ్రహం వ్యక్తం చేసింది. నా కారు (ఏపీ 10 ఏవై 5555)నే ఆపుతారా? అంటూ ప్రశ్నించింది.
ఇప్పుడె ఎమ్మెల్యేకి పోన్ చేస్తాను మాట్లాడంటూ పోలీసులతో దురుసుగా వ్వవహరించింది. దీంతో, ఆమెపై తణుకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే రోడ్డుపై హర్షిత హల్ చల్ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ కలిగింది.
భీమవరం మావూళ్లమ్మని దర్శించుకుంటే రాష్ట్రపతి అవడం ఖాయం

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మావూళ్లమ్మను దర్శించుకుంటే రాష్ట్రపతి అవడం ఖాయమట. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు చేసిన ఈ వ్యాఖ్య సభలో నవ్వులు పూయించింది.
ఆలయానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఈ అధికార పార్టీ సభ్యుడు, ఆలయాన్ని సందర్శించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కోరారు. దీంతో సభలో నవ్వుకున్న కోడెల శివప్రసాద్ రావు మాట్లాడుతూ "ఇప్పుడు ఆలయానికి వస్తే, అందుకే వచ్చాననుకుంటారు" అని అన్నారు.












Click it and Unblock the Notifications