దేశంలో ఫస్ట్: బస్టాండ్‌లో మల్టీప్లెక్స్ థియేటర్, టిక్కెట్ కొన్న బాబు (పిక్చర్స్)
విజయవాడ: బస్టాండులో బస్సు కోసం వేచి చూడాల్సి వచ్చినప్పుడు మనం... అక్కడ కనిపించే టీవీ తెరలను చూస్తాం. మరీ నాలుగైదు గంటల పాటు నిరీక్షించవలసి వస్తే పక్కనే ఏమైనా థియేటర్ ఉంటే అక్కడకు వెళ్లి సినిమాను చూస్తాం. విజయవాడ బస్టాండ్లో ఈ తరహా ఇబ్బందులు అవసరం లేదు.
ఇక ఎంచక్కా బస్టాండులోనే సినిమా చూడవచ్చు. ఈ తరహా ఏర్పాటు దేశంలోనే తొలిసారిగా ఏపీలోని విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచనకు 'వై స్ర్కీన్' అనే థియేరట్ల నిర్మాణ సంస్థ కార్యరూపం ఇచ్చింది.
అత్యంత అధునాతన టెక్నాలజీతో బెజవాడ బస్టాండులో రూపొందిన ఈ థియేటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ప్రారంభించారు.
తద్వారా స్థానిక నెహ్రూ బస్టాండులో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక వసతులతో ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంటున్న విజయవాడ బస్టాండ్... మల్లీప్లెక్స్ ఏర్పాటుతో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది.
ఇటీవలి కాలంలో దేశంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో రూపు రేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతం బస్టాండ్లలో టీవీలు ఏర్పాటు చేయడం, వైఫై సౌకర్యం కల్పించడం చూశాం. కానీ బెజవాడ బస్టాండులో థియేటర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను నిజం చేసి చూపించింది ఏపీఎస్ఆర్టీసీ.
టిక్కెట్ కొని సినిమా చూసిన చంద్రబాబు
నెహ్రూ బస్టాండులో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. టిక్కెట్ కొనుక్కొని మరీ కాసేపు సినిమాను వీక్షించారు. ప్రయాణీకులకు వినోదాన్ని పంచే ఉద్దేశ్యంతోనే ఈ మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు
నెహ్రూ బస్టాండులో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. టిక్కెట్ కొనుక్కొని మరీ కాసేపు సినిమాను వీక్షించారు. ప్రయాణీకులకు వినోదాన్ని పంచే ఉద్దేశ్యంతోనే ఈ మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు
నెహ్రూ బస్టాండులో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. టిక్కెట్ కొను���్కొని మరీ కాసేపు సినిమాను వీక్షించారు. ప్రయాణీకులకు వినోదాన్ని పంచే ఉద్దేశ్యంతోనే ఈ మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు
మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభిస్తున్న చంద్రబాబు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమమహేశ్వర రావు, శిద్ధా రాఘవ రావు తదితరులు.

చంద్రబాబు
అమరావతి స్పెషల్ బస్సుల్లో ప్రయాణీకుల కోసం సీటుకో టీవీ, రిమోట్ ఏర్పాటు చేశ��రు. వాటిని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు విజయవాడలో బస్సు డ్రైవర్ సీట్లో కూర్చొని సందడి చేశారు.

చంద్రబాబు
నెహ్రూ బస్టాండులో అత్యంత అధునాతన టెక్నాలజీతో బెజవాడ బస్టాండులో రూపొందిన థియేటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ప్రారంభించారు. తద���వారా స్థానిక నెహ్రూ బస్టాండులో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది.

చంద్రబాబు
మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభిస్తున్న చంద్రబాబు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమమహేశ్వర రావు, శిద్ధా రాఘవ రావు తదితరులు.












Click it and Unblock the Notifications