బాలయ్య పంచ్, జగన్ ఆదేశాలను గాలికి వదిలేసిన వైసీపీ లీడర్స్, ఇంద్రజ జంప్
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఇంతకాలం సొంత నియోజకవర్గంలో లోని హిందూపురం మున్సిపాలిటీలో పెత్తనం చెలాయించిన వైసీపీకి నందమూరి బాలకృష్ణ చెక్ పెట్టారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ ఆమె పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు చైర్మన్ పదవికి, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి.
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఇంద్రజ బాలయ్య సమక్షంలో ఇటీవల టీడీపీలో చేరారు. వారంలోపు హిందూపురం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగడానికి రంగం సిద్ధమైంది. హిందూపురం మునిసిపల్ చైర్మన్ పదవికి ఇంద్రజ రాజీనామా చెయ్యడంతో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ ఆమె రాజీనామాను ఆమోదించింది.

హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ రాజీనామా లేఖని సంబంధిత అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ కి ఆన్ లైన్ లో పంపించారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 12 మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో ఇటీవల టీడీపీలో చేరారు. హిందూపురం మున్సిపల్ సమావేశానికి 19 కౌన్సిలర్లు హాజరయ్యారు.
ఇందులో టీడీపీ, బీజేపీ కౌన్సిలర్లతో పాటు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఉన్నారు. వైసీపీ సింబల్ తో కౌన్సిలర్లుగా, చైర్మన్ గా గెలిచిన వాళ్లు టీడీపీలో ఎలా చేరుతారని హిందూపురం మునిసిపల్ సర్వసభ్య సమావేశంలో వాళ్లను నిలదీయాలని వైసీపీ హై కమాండ్ ఆ పార్టీ కౌన్సిలర్లకి ఆదేశాలు జారీ చేసింది. అయితే వైసీపీ హై కమాండ్ ఆదేశాలను గాలికి వదిలేసిన వైసీపీ కౌన్సిలర్లు ఆ సమావేశానికి కూడా హాజరు కాలేదు.

హిందూపురం మునిసిపల్ సర్వసభ్య సమావేశంలో హాజరై ఇటీవల టీడీపీలో చేరిన చైర్మన్ ఇంద్రజతో పాటు సాటి కౌన్సిలర్లతో గొడవ పెట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదని, రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఇప్పుడు ఇక్కడ కూడా గొడవ పెట్టుకుంటే లేనిపోని సమస్యలు ఎదురవుతాయని అనుకున్న హిందూపురం వైసీపీ కౌన్సిలర్లు ఆ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. వైసీపీ హై కమాండ్ ఆదేశాల్ని హిందూపురం వైసీపీ కౌన్సిలర్లు ఏమాత్రం పట్టించుకోలేదు.
వారంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న కౌన్సిలర్ రమేష్ ని కొత్తగా చైర్మన్ చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్ణయించారని తెలిసింది. ఇప్పటికే హిందూపురం చైర్మన్ పదవికి రమేష్ పేరు ఖరారు కావడంతో అధికారికంగా చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆయన ఆ పదవికి నామినేషన్ చేస్తారని తెలిసింది. మొత్తం మీద హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీకి సినిమా చూపించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆ పార్టీ హైకమాండ్ కి పెద్ద షాక్ ఇచ్చారని హిందూపురం ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications