ఏపీలో ఆ మండలాల్లో నివసించే మున్నూరు కాపులు ఇక బీసీలుగా గుర్తింపు

అమరావతి: రాష్ట్రంలో ఇటీవల గోదావరికి సంభించిన వరదల సమయంలో ఏడు విలీన మండలాలు పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కాయి. తమను ఇదివరకట్లా తెలంగాణలో విలీనం చేయాలంటూ ఆయా మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్డెక్కారు. ఆందోళనలకు దిగారు. ఏపీలో తాము నివసించలేమంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సహాయ, సహకారాలు అందట్లేదంటూ అప్పట్లో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా విలీన మండలాల్లో పర్యటించడంతో వారి నిరసనలు కాస్తా రాజకీయ రంగును పులుముకొన్నాయి. ఇప్పుడదే ఏడు విలీన మండలాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించింది.

ఏడు విలీన మండలాల పరిధిలో నివసించే మున్నూరు కాపు కులస్తులను ఏపీ ప్రభుత్వం వెనుకబడిన సామాజిక వర్గాలుగా గుర్తించింది. బీసీ-డీ కేటగిరిలోకి చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. నిజానికి- మున్నూరు కాపులు అగ్రకులాలా జాబితాలో కొనసాగుతున్నారు. తమను బీసీలుగా గుర్తించాలంటూ విలీన మండలాల్లో నివసించే మున్నూరు కాపులు వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

 Munnuru Kapu community people in the 7 mandals will now be considered BC-D category

వారి డిమాండ్ పట్ల వైఎస్ జగన్ అప్పట్లో సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్ 49ను విడుదల చేశారు. దీనితో కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం, ఎటపాక, బూర్గంపాడు మండలాల పరిధిలోని గ్రామాల్లో నివసించే మున్నూరు కాపులు ఇబీసీ-డీ కేటగిరిలోకి చేరినట్టయింది.

తాజాగా జారీ అయిన ఉత్తర్వులకు అనుగుణంగా- కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలంటూ ప్రభుత్వం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆదేశించింది. తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాల పరిధిలో నివసించే వారిలో మున్నూరు కాపు కులస్తుల సంఖ్య అధికంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారి డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+