వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోకి రండి: పవన్‌కు మురళీ మోహన్ పిలుపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను తాను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత మురళీ మోహన్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పదవుల కోసం కాకుండా దేశానికి సేవ చేయాలనే మంచి భావం కల వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ దింపుడు కళ్లం లాంటిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వెంటిలెటర్‌పై ఉందని వ్యాఖ్యానించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని మురళీ మోహన్ విమర్శించారు.

Murali Mohan invites Pawan Kalyan into TDP

గొప్పగా మాట్లాడాడు.. కానీ సందేశం లేదు: హర్షకుమార్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం తన పార్టీ ఏర్పాటు సందర్భంగా గొప్పగా మాట్లాడారు కానీ అందులో సందేశం ఏం లేదని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు హర్ష కుమార్ అన్నారు. అయితే ఆయన సిద్ధాంతాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై పవన్ లేవనెత్తిన అంశాలకు ఏ రాజకీయ పార్టీ సమాధానం చెప్పలేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ లోకకళ్యాణం కోసం పార్టీ పెడితే తాము హర్షిస్తామని సీమాంధ్ర బిజెపి అధ్యక్షుడు హరిబాబు అన్నారు. కాంగ్రెస్ హటావో అని ఇచ్చిన పవన్ నినాదాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని హరిబాబు చెప్పారు.

English summary
Telugudesam Party senior leader Murali Mohan on Saturday said that he invited Janasena Party president Pawan Kalyan his party.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X