వైసీపీది అదో డ్రామా, నేనైతే శ్రీరెడ్డికి 'మా' సభ్యత్వం ఇవ్వను: మురళీ మోహన్
అమరావతి: తన కోడలుకు రాజకీయాల్లోకి రావాలని లేదని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ గురువారం అన్నారు. తాను నియోజకవర్గంలో అందుబాటులో లేనిసమయంలో ఆమె తన బదులు సేవలు అందిస్తోందని వెల్లడించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసినట్లు చెప్పడంపై మురళీ మోహన్ స్పందించారు. వారిది అంతా డ్రామా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 25 మందిని లోకసభకు పంపిస్తే చంద్రబాబు రాష్ట్రానికి పూర్తి న్యాయం చేస్తారని చెప్పారు.

శ్రీరెడ్డి అర్ధనగ్న దీక్ష, ఆమె విమర్శల పైన కూడా ఆయన స్పందించారు. ఆమె అర్ధనగ్న ప్రదర్శన తప్పు అన్నారు. క్రమశిక్షణ లేని వారికి 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సభ్యత్వం ఇవ్వదని తేల్చి చెప్పారు.
నేను కనుక 'మా' అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఆమెకు కచ్చితంగా సభ్యత్వం ఇవ్వనని చెప్పారు. గతంలో ఎన్నో సమస్యలను పరిష్కరించామని చెప్పారు. సినీ పరిశ్రమను అభాసుపాలు చేయవద్దని ఆయన శ్రీరెడ్డిని, ఇతర నటులను కోరారు.
చంద్రబాబు దీక్షకు మద్దతు
హోదా కోసం ఏపీలోని అన్ని పార్టీలు కలిసి పోరాడాలని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పిలుపునిచ్చారు. హోదా ఇస్తామంటూ తొలుత హామీ ఇచ్చిన కేంద్రం ఆ తర్వాత ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కావడం లేదన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ఒప్పుకోవడం లేదంటూ తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారని, ప్రత్యేక హోదాకు తాము అడ్డంకి కాదని సాక్షాత్తు ఆర్థిక సంఘం ఛైర్మన్ చెప్పారన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు రేపు చేపడుతున్న నిరాహారదీక్షకు సినీ పరిశ్రము మద్దతు ఉంటుందన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అన్నారు.
దేశవ్యాప్తంగా బ్యాంకులలో, ఏటీఎంల వద్ద తీవ్రమైన నగదు కొరత ఉందని, ఏపీలో నగదు కొరతపై దారుణంగా ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. నగదు కొరత ఇబ్బందులపై ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరసన తెలపాలని కాంగ్రెస్ నాయకులకు ఆయన పిలుపును ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీలో నగదు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇది చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నగదు కొరత వల్ల ప్రజలు అవస్థ పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దును చంద్రబాబు స్వాగతించారని, పరిష్కార కమిటీ అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications