ఇబ్బందే: పవన్‌పై మురళీమోహన్, స్మగ్లింగ్‌లా: ఉండవల్లి
మెదక్/రాజమండ్రి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ ఆరంగేట్రంపై ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మురళీ మోహన్ ఆదివారం స్పందించారు. పవన్ తెలుగుదేశం పార్టీతో కలుస్తాడని భావిస్తున్నామన్నారు. అయితే, పవన్ కొత్త పార్టీ పెడితే టిడిపికి పాక్షికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
గజ్వెల్ నుండి పోటీ చేయమంటున్నారు: హరీష్
తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును గజ్వెల్ నుండి పోటీ చేయలని కార్యకర్తలు కోరుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క కెసిఆర్ వల్లే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభిప్రాయం మేరకు ఎక్కడ పోటీ చేయాలనేది కెసిఆర్ నిర్ణయించుకుంటారన్నారు. పొత్తులు వద్దన్న మాజీ మంత్రి జానా రెడ్డి సూచనను తాము స్వాగతిస్తున్నామన్నారు.

స్మగ్లింగ్ చేసినట్లు విభజన: ఉండవల్లి
కాంగ్రెస్ బహిష్కృత ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విభజన అంశంపై మరోసారి గళమెత్తారు. స్మగ్లింగ్ చేసినట్టు రాష్ట్రాన్ని ముక్కలు చేశారని కాంగ్రెస్ అధిష్ఠానంపై మండిపడ్డారు. రాజధాని ఉన్న ప్రాంతం ఇంతకుముందెన్నడూ విడిపోలేదన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. దేశ చరిత్రలో సమైక్యాంధ్ర ఉద్యమం లాంటిది మరొకటి లేదన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజలే నడిపించారని తెలిపారు. విభజనను అందరు వ్యతిరేకించాలని సూచించారు. ఇంత అన్యాయంగా రాష్ట్ర విభజన చరిత్రలో జరగలేదన్నారు. సమైక్యవాదులకు కనీసం పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. ఇది దౌర్భాగ్యమ్నారు. విభజనతో ఏడువేల మెగావాట్ల విద్యుత్ కొరత వస్తుందంటే పట్టించుకోలేదని ఆరోపించారు. పార్లమెంటులో ఘటనలు కలచివేశాయని చెప్పారు. సమైక్య ఉద్యమాన్ని జాతీయ పార్టీలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications