సోషల్ మీడియాతోనే నిజాలు: మురళీధర్(పిక్చర్స్)
విశాఖపట్నం: ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని వాస్తవ రూపంలో ప్రజలకు చేరవేసే గొప్ప సంస్థ సోషల్ మీడియా అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. సమాజంలో జరిగే వాస్తవాలను ప్రచురించడం వల్లే అన్ని వర్గాల ప్రజలు సోషల్ మీడియాను గౌరవిస్తున్నారని తెలిపారు.
‘సోషల్ మీడియా పాత్ర-సామాజిక మార్పు' అంశంపై ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్‌హైజ్‌లో ఆదివారం జరిగిన అవగాహనా సదస్సును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మురళీధరరావు మాట్లాడుతూ.. మీడియా ప్రచురించిన వార్తలు, కథనాల వల్లే సమాజంలో మార్పులు వస్తున్నాయని చెప్పారు.
అతిక్లిష్టమైన విషయం దగ్గర నుంచి అతి కష్టమైన విషయం వరకూ వార్తలను సేకరించి ప్రచురించేందుకు మీడియా చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు. ప్రస్తుతం సమాజంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయిందని చెప్పారు. ప్రతీ 20మందిలో 15 మంది ఫోన్లలో ఇంటర్నెట్, యూట్యూబ్, వాట్సప్ లాంటి సౌకర్యాలను వాడుతున్నారని చెప్పారు.
అవసరాలకు తగినట్లుగా టెక్నాలజీని వాడటం తప్పుకాదు గానీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిజిటల్ మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా త్వరలో ప్రతి ఇంటికీ నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు ఎంపి హరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పివిఎన్ మాధవ్, పార్టీ నగర అధ్యక్షుడు పివి నారాయణరావు, హిందూ పత్రిక ప్రతినిధి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మురళీధర్ రావు
ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని వాస్తవ రూపంలో ప్రజలకు చేరవేసే గొప్ప సంస్థ సోషల్ మీడియా అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు.

మురళీధర్ రావు
సమాజంలో జరిగే వాస్తవాలను ప్రచురించడం వల్లే అన్ని వర్గాల ప్రజలు సోషల్ మీడియాను గౌరవిస్తున్నారని తెలిపారు.

మురళీధర్ రావు
‘సోషల్ మీడియా పాత్ర-సామాజిక మార్పు' అంశంపై ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్‌హైజ్‌లో ఆదివారం జరిగిన అవగాహనా సదస్సును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రారంభించారు.

మురళీధర్ రావు
ఈ కార్యక్రమానికి హాజరైన మురళీధరరావు మాట్లాడుతూ.. మీడియా ప్రచురించిన వార్తలు, కథనాల వల్లే సమాజంలో మార్పులు వస్తున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications