వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ‘కోడికత్తి’లానే నాని ‘తాపీ దాడి’ -అప్పుడే చంపగలమన్న మాజీ పోలీస్ -ప్రాణాలిస్తానన్న మహిళ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని)పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు వేగం పెంచినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ సోమవారం మీడియాకు తెలిపారు. మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో ఆదివారం ఊహించని విధంగా ఘటన జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు పోలీసులు మాత్రమే విధుల్లో ఉండటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపితే కానీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎస్పీ అన్నారు. నిందితుడు నాగేశ్వరరావు టీడీపీ కార్యకర్తేనని ప్రచారం జరుగుతుండటంపై టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Recommended Video

#PerniNani : మంత్రి Perni Naniపై దుండగుడి దాడి.. కాళ్లకు దండం పెట్టడానికి వచ్చి పదునైన తాపీతో..!

సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020

రంగంలోకి 4 స్పెషల్ టీమ్స్..

రంగంలోకి 4 స్పెషల్ టీమ్స్..

మంత్రి నాని తల్లి నాగేశ్వరమ్మ పెద్దకర్మ కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నం మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏర్పాటు చేయగా, అక్కడికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వారిలో బడుగు నాగేశ్వరరావు అనే తాపీ మేస్త్రీ.. మంత్రి కాలర్ పట్టుకుని వెంట తెచ్చుకున్న పదునైన తాపీతో రెండు సార్లు పొడిచాడు. అయితే, తాపీ పోటు కాస్తా మంత్రి ధరించిన లెదర్‌ బెల్ట్‌ కు తగలడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కిందపడిపోయిన మంత్రిని ఓ అంగన్ వాడీ కార్యకర్త పైకి లేపారు. చొక్కా చిరిగిన స్థితిలో మంత్రిని చూసి షాకైన కార్యకర్తలు నిందితుడిని బంధించి, పోలీసులకు అప్పించారు. నిందితుడు టీడీపీ కార్యకర్తే అని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజకీయంగానూ వివాదాస్పదం కావడంతో పోలీసులు ఈ కేసును కీలకంగా భావిస్తున్నారు. నాగేశ్వరావుపై ఐపీసీ సెక్షన్ 307(మర్డర్ అటెప్ట్)కింద కేసు నమోదు చేశామని, ఈ ఘటనను సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. కాగా,

ఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారుఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారు

జగన్ కోడికత్తి కేసుతో లింకు..

జగన్ కోడికత్తి కేసుతో లింకు..

పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడు నాగేశ్వరరావుకు టీడీపీతో సంబంధం లేదని, ఇసుక విషయంలో జగన్ సర్కారు విధానాల వల్ల పని కోల్పోయిన ఆక్రోషంతోనే మేస్త్రీ నాగేశ్వరావు తాపీతో మంత్రిపై దాడి చేసి ఉండొచ్చని, ఈ విషయంలో వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. టీడీపీకే చెందిన మరో సీనియర్ నేత, మాజీ పోలీస్ అధికారి వర్ల రామయ్య మరో అడుగు ముందుకేసి.. నానిపై తాపి దాడి ఘటనతో.. కొన్నేళ్ల కిందట విశాఖలో వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి ఘటనను లింకు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రెండు కేసులూ దాదాపు ఒకేలా ఉన్నాయని వర్ల చెప్పారు.

అప్పుడు మాత్రమే చంపగలం..

అప్పుడు మాత్రమే చంపగలం..

నాడు జగన్ పై, తాజాగా పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నాల్లో నిందితులు వాడిన ఆయుధాలు, ఘటనలు జరిగిన తీరుపై వైసీపీ, టీడీపీల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడం తెలిసిందే. వీటిపై వర్ల రామయ్య స్పందిస్తూ.. ‘‘ఆనాటి కోడి కత్తి దాడికి, ఈనాటి తాపీ దాడికి సారూప్యమున్నట్లుగా కనిపిస్తున్నది. ఆనాటి బాధితుడు (ప్రస్తుత) ముఖ్యమంత్రి అయితే, తాజా బాధితుడు రవాణా మంత్రి. ఆనాడు కోడికత్తితో జగన్ ను చంపాలనుకుంటే, ఇవాళ తాపీతో మంత్రిని చంపాలనుకున్నారు. ఇలాంటి ఆయుధాలతో కదలకుండా పడుకున్న మనిషిని మాత్రమే చంపగలం. సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీస్తారా?'' అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే,

నాని కోసం ప్రాణాలైనా ఇస్తా..

నాని కోసం ప్రాణాలైనా ఇస్తా..

ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం సమయంలో అక్కడే ఉండి, పెను ప్రమాదం తొలగిపోయేలా చేసిన ఓ మహిళ తాలూకు వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మంత్రి నాని కోసం నా ప్రాణాలైనా ఇస్తానని చెబుతోన్న ఆ మహిల పేరు గుడివాడ పద్మావతి. మచిలీపట్నంలోనే అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోన్న ఆమె.. ఆదివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. నానిపై దాడి జరుగుతోన్న సమయంలో అక్కడే ఉన్న పద్మావతి.. నిందితుడు నాగేశ్వరరావును పక్కకు లాగేశారు. మరుక్షణంలోనే వెనుకకు పడిన మంత్రి పేర్ని నానిని పద్మావతి లేవదీసే ప్రయత్నం చేశారు. ఘటన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానని ఉద్వేగంగా చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.

English summary
tdp leader varla ramaiah and others compares attack on perni nani with Knife attack on jagan. Police have expedited the investigation into murder attempt on minister perni nani. 4 special teams set up to investigate. anganwadi worker, who saved minister also spoke to media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X