మచిలీపట్నంలో వైసీపీ నేత కుమారుడిపై హత్యాయత్నం ... చేసింది ఎవరంటే
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. వైసిపి నేత , మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకు ఖాదర్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లో ఉన్న సమయంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. బాధితుని పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మచిలీపట్నం వైసీపీ నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకు ఖాదర్ పై ఆయన భార్యనే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది . కుటుంబ కలహాల నేపధ్యంలోనే భార్య ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా సమాచారం .ఇక సాలు విషయానికి వస్తే ఖాదర్ 14 ఏళ్ల క్రితం షేక్ నదియాను వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆయన తన భార్య నదియాకు తెలియకుండా ఆమె సొంత చెల్లెల్ని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం విషయంలో నదియా, ఖాదర్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి .

దీంతో భార్య నదియా ఖాదర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిందని భావిస్తున్నారు. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రగాయాలతో ఉన్న ఖాదర్ ఇప్పుడు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ప్రమేయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications