భార్య, అత్తను దారుణంగా నరికి చంపిన కిరాతకుడు !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోరుకొండ పరిధిలోని సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యతో పాటు అత్తను కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం.. సోడదాసి సీతారామరాజు, లత ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రారంభంలో వారి దాంపత్య జీవితం సజావుగానే సాగినప్పటికీ.. గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలు ఎక్కువ కావడంతో లత తన తల్లి లక్ష్మి ఇంటికి వెళ్లి అక్కడే నివసిస్తోంది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న సీతారామరాజు ఆగ్రహంతో ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు.

murder-case-that-husband-killed-wife-and-mother-in-law-at-east-godavari-and-police-enquiry-goes-on

కాగా సోమవారం అర్ధరాత్రి సమయంలో సీతారామరాజు అత్తగారింటికి వెళ్లి, లత, లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అరుపులు విని పొరుగువారు బయటకు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రక్తపు మరకలు, పగిలిన గృహోపకరణాలు కనిపించడం దాడి తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ ఘటన వెనుక భార్యపై ఉన్న అనుమానమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు, పొరుగువారి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తేనని పోలీసులు వెల్లడించారు. అతని ప్రవర్తనపై ఇప్పటికే గ్రామంలో భయాందోళనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎంతటి దారుణ పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+