శశికళ హత్య: అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భర్తకు అనుమతి..

కేరళకు చెందిన మరో మహిళతో అతనికి అక్రమ సంబంధం ఉందని చెబుతూ శశికళ తన సోదరునికి ఈమెయిల్ పంపడం.. ఆ తర్వాతే ఆమె హత్యకు గురవడం భర్త వైపు వేలెత్తి చూపేలా చూశాయి.

న్యూయార్క్: అమెరికాలో వరుసగా జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో.. న్యూజెర్సీలో శశికళ(40), ఆమె కుమారుడు అనీష్ సాయి(7) హత్యకు గురైన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తొలుత ఈ హత్య వెనుక జాత్యహంకార కోణం ఉందా? అని అనుమానించినప్పటికీ..భార్య-భర్తల మధ్య విబేధాలే కారణమన్న వాదన కూడా తెర పైకి వచ్చింది.

అయితే హత్య ఘటనకు సంబంధించి స్పష్టమైన కారణాలేవి బయటకు రానప్పటికీ.. శశికళ తరుపు బంధువులు మాత్రం ఆమె భర్త నర్రా హనుమంతరావునే అనుమానిస్తున్నారు. కేరళకు చెందిన మరో మహిళతో అతనికి అక్రమ సంబంధం ఉందని చెబుతూ శశికళ తన సోదరునికి ఈమెయిల్ పంపడం.. ఆ తర్వాతే ఆమె హత్యకు గురవడం భర్త వైపు వేలెత్తి చూపేలా చూశాయి.

Murdered Andhra Techie's Husband Allowed By US To Attend Funeral In India

అమెరికాలో మాత్రం నర్రా హనుమంతరావుపై ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీంతో అతని విదేశీ ప్రయాణాలను నియంత్రించడం లేదని, భార్య అంత్యక్రియలకు వెళ్లే అనుమతి హనుమంతరావుకు ఉందని బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ అధికార ప్రతినిధి జోయెల్ బోవ్లీ చెప్పారు.

కాగా, హనుమంతరావు గత వారం రోజులుగా వేరే మహిళతో ఉంటున్నట్లు స్థానిక సీబీఎస్ ఫిల్లీ చానల్ వార్తలు ప్రసారం చేయడం గమనార్హం. అయితే ఆ మహిళకు సంబంధించిన వివరాలు మాత్రం చానెల్ వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+