హీటెక్కిన అనంత పాలిటిక్స్ : డీజీపీ నగరంలోనే ఉన్నా..! 'రాజకీయ దాడులు'
అనంతపురం : అనంత పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య దాడులతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలపై మరోమారు పరిటాల శ్రీరామ్ వర్గీయులు దాడులకు పాల్పడడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పరిటాల శ్రీరామ్ వర్గీయుల చేసిన దాడిలో గాయపడి, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతలను పార్టీకి చెందిన రాప్తాడు నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లగా సోమవారం రాత్రి మరోమారు పరిటాల శ్రీరామ్ వర్గం దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆసుపత్రిలోను శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి అనంతపురంలో నెలకొందా..! అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అయితే శ్రీరామ్ అనుచరులు దాడికి పాల్పడుతున్న సమయంలో ఆసుపత్రి సెక్యూరిటీ ఎందుకు అడ్డుపడలేదన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, దీని వెనుక పలు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.
ఆసుపత్రి భద్రతను పర్యవేక్షిస్తోన్న జై బాలాజీ సెక్యూరిటీ మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీకి చెందినది కావడంతోనే ఆసుపత్రి సెక్యూరిటీని తమ అదుపు ఆజ్నలలో పెట్టుకుని దాడులకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ డీజీపీ నగరంలోనే ఉండగా ఈ దాడులు జరగడం శాంతిభద్రతలను ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తోంది.
దాడి జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలోని ఆసుపత్రిలోని రోగులంతా బయటకు పరుగులు పెట్టినట్టుగా సమాచారం. దాడిలో ఆసుపత్రి ఫర్నీచర్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పరిటాల సునీత సోదరుడి ఆదేశాలతోనే ఆసుపత్రి సిబ్భంది దాడిని అడ్డుకోలేదంటున్నాయి వైసీపీ శ్రేణులు.












Click it and Unblock the Notifications