చక్రిది సహజ మరణం: 'విష ప్రయోగం జరగలేదు'

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయన అస్ధికల్లో ఎలాంటి విషపదార్ధాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైందని నిపుణులు తేల్చారు. దీంతో అనారోగ్యంతో చక్రి మరణించారని తెలుస్తోంది.

చక్రి అస్ధికలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించి ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. చక్రి అస్ధికల్లో ఎలాంటి విష పదార్ధాల ఆనవాళ్లు లేవని నివేదిక సమర్పించారు. దీంతో చక్రిది సహజమరణమేనని అన్నారు. ఆయన మృతిపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు.

Music Director Chakri death mystery unravelled

చక్రి మరణంపై మిస్టరీ ఉందంటూ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసి విషయం తెలిసిందే. చక్రి భార్య శ్రావణి, ఆమె అత్తమామలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఫోరెన్సిక్ నివేదికతో చక్రి మరణంపై ఉన్న మిస్టరీ వీడింది. చక్రి చనిపోయన తర్వాత ఆయన అంత్యక్రియలను పంజా గుట్టాలోని స్మశాన వాటికలో నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+