మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో చర్చలు సఫలం, సమ్మె విరమణ

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో పాటు బాధితురాలు వనజాక్షి శనివారం చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో దాడికి చోటుచేసుకున్న పరిణామాలను ఎమ్మార్వో వనజాక్షి స్వయంగా చంద్రబాబుకు వివరించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగడానికి గల కారణాలను ఉద్యోగ సంఘాల నేతలు బాబుకు వివరించారు.

సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం ఎమ్మార్వో వనజాక్షి మీడియాతో మాట్లాడారు. తనపై దాడికి దిగిన ఎమ్మెల్యే చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీరుపెట్టారు. దాడి ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎమ్మార్వో వనజాక్షి డిమాండ్ చేశారు. విచారణ కమిటీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.

మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

ఈ దాడి ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని, సరిహదుద్దలపైనా నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. అంతేకాదు ఏలూరులో తహసీల్దారు వనజాక్షిపై కేసులు ఎత్తివేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
 మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

ఎమ్మార్వోపై దాడి సమయంలో ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపైనా ఐఏఎస్‌ కమిటీ విచారణ జరపనుంది. ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులపై దాడులు పునరావృతం కాకుండా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మార్వోపై దాడి జరగడం దురదృష్టకరమని సీఎం అన్నట్టు ఆయన పేర్కొన్నారు.

 మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

చంద్రబాబుతో సమావేశంలో ఉద్యోగులపై దాడులు చేస్తే ఎలా పనిచేయాలని సీఎంను అడిగనట్లు బొప్పరాజు తెలిపారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీతోనే చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు తెలిపారు. దాడి ఘటనపై విచారణ జరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

 మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

మళ్లీ ఏడ్చిన ఎమ్మార్వో వనజాక్షి: బాబుతో రెవెన్యూ ఉద్యోగుల చర్చలు సఫలం

చంద్రబాబుతో జరిగిన చర్చలు సఫలం అవడంతో రేపటి నుంచి తలపెట్టిన వర్క్ టూ రూప్‌ను విరమించుకున్నట్టు రెవెన్యూ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు బొప్పరాజు పేర్కొన్నారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+