జనసేన ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావు, పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్
అమరావతి: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావును నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. విజయవాడకు చెందిన కృష్ణారావు ప్రస్తుతం జనసేన కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా ఉన్నారు.
కార్యకర్తల మనోభావాలు అధినేతకు తెలియజేయడంతో పాటు పార్టీ విజయానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. జనసేనానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ముత్తంశెట్టి కృష్ణారావు నోవా విద్యాసంస్థల అధినేత. విజయవాడలోని కృష్ణారావు నివాసాన్నే జనసేన కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఏలూరులో పవన్‌ను కలిసిన ఆయన ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications