భారత్‌కు నా గడ్డమే అదృష్టం తెచ్చి పెట్టింది: రవీంద్ర జడేజా

పెర్త్: ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టుకు తన గడ్డమే అదృష్టం తెచ్చి పెట్టిందని రవీంద్ర జడేజా అన్నాడు. ప్రపంచ కప్ పోటీలు ముగిసే వరకు తాను గడ్డం పెంచుతూనే ఉంటానని, తీసేయబోనని ఆ భారత ఆల్ రౌండర్ అన్నాడు. శుక్రవారంనాటి మ్యాచులో వెస్టిండీస్‌ను 44.2 ఓవర్లకే అవుట్ చేసిన తర్వాత అతను తాను భారత్‌కు తెచ్చి పెట్టిన అదృష్టం గురించి మాట్లాడాడు.

తన గడ్డం వరుసగా భారత్ మూడు మ్యాచులు గెలిచే అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని అతను అన్నాడు. తొలి మ్యాచులో పాకిస్తాన్‌పై విజయం సాధించిన తర్వాత భారత్ వెనక్కి తిరిగి చూడలేడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లపై కూడా సునాయసంగా విజయాలు సాధించింది.

My beard is a lucky charm for India at World Cup: Ravindra Jadejal

వెస్టిండీస్‌ను మట్టి కరిపించడం ద్వారా భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసుకుంది. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ జడేజాను గడ్డం గురించి అడిగాడు. టీవీలో ఆయన దానికి సంబంధించిన ప్రశ్న వేశాడు. ప్రథమంగా ఇది అదృష్టకరమైందని జడేజా అన్నాడు.

వరుసగా తాము మూడు మ్యాచులు గెలిచామని, గడ్డం లేకుండా తాను బాగా కనిపించబోనని, దాన్ని పెంచుతూనే ఉంటానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+