హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మై ఎవ్రీడే హీరో బంగ్లాదేశ్ హకీమ్: ఎందుకో చెప్పిన పవన్, రాజకీయంగా విలువైన సూచనలు

లండన్‌లో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఎక్సలెన్సీ అవార్డును రెండు రోజుల క్రితం అందుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

లండన్: లండన్‌లో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఎక్సలెన్సీ అవార్డును రెండు రోజుల క్రితం అందుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇలాంటి వారిని తాను ఆరాధిస్తుంటానని పేర్కొన్నారు.

చదవండి: ఎప్పుడూ నేను ఆ వైపే: పవన్, భారత్‌లో పెట్టుబడులపై, లండన్‌లో బిజీబిజీగా (ఫోటోలు)

బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తితో ఫోటో దిగి, ఆ ఫోటోను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అతని గురించి తెలిపారు. అలాంటి వారు తనకు టీచర్ లాంటి వారు అని కొనియాడారు.

మిస్టర్ హకీమ్, నేను ఆరాధిస్తాను, గౌరవిస్తాను

మిస్టర్ హకీమ్, నేను ఆరాధిస్తాను, గౌరవిస్తాను

తొలుత హకీమ్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. నేను ఆరాధించే, గౌరవించే హకీమ్ అంటూ పేర్కొన్నారు. మై ఎవ్రీ డే హీరో అంటూ మరో మూడు పోస్టులు పెట్టారు. తాను ఎప్పుడు లండన్‌కు వెళ్లినా ప్రతిసారి హకీమ్ తన వెంటే ఉండి చాలా సాయం చేశాడని పేర్కొన్నారు.

ఎప్పుడు ఏ విషయం చెప్పలేదు

ఎప్పుడు ఏ విషయం చెప్పలేదు

అతను తన కారులో లండన్ మొత్తం చుట్టి చూపిస్తారని పవన్ పేర్కొన్నారు. హకీమ్ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని, కొన్ని తరాల క్రితం వారి కుటుంబం లండన్ వచ్చి స్థిరపడిందని చెప్పారు. ఆ వ్యక్తి తనతో ఎప్పుడూ ఏ విషయం చెప్పలేదని పేర్కొన్నారు.

రాజకీయ జర్నీ కోసం విలువైన సూచన చేసిన బంగ్లాదేశీ

రాజకీయ జర్నీ కోసం విలువైన సూచన చేసిన బంగ్లాదేశీ

ఇన్ని సంవత్సరాల్లో నాతో ఆయన రెగ్యులర్‌ గ్రీటింగ్స్‌కు మించి ఒకమాట మాట్లాడి ఉండరని పవన్ పేర్కొన్నారు. నిన్న మాత్రం తనకు ఓ సూచన చేశారని చెప్పారు. తన రాజకీయ జర్నీ కోసం ఓ విలువైన సూచన చేశారని చెప్పారు.

అవి చెప్పారు, నేను సమ్మతించా

అవి చెప్పారు, నేను సమ్మతించా

నా రాజకీయ జీవితంలో మహిళల రక్షణ, గృహహింస నిరోధం, సీనియర్‌ సిటిజెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని హకీం చెప్పారని పవన్ పేర్కొన్నారు. వీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వమని కోరారని, అందుకు నేను సమ్మతించానని తెలిపారు. ఆయన చెప్పగానే వాటిపై ప్రత్యేక దృష్టి పెడతానని మాట ఇచ్చానన్నారు.

నా హృదయాన్ని కదిలించాయి

నా హృదయాన్ని కదిలించాయి

హకీంకు మహాత్మా గాంధీ పట్ల ఉన్న గౌరవం తన హృదయాన్ని తాకిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన గాంధీ గురించి చెప్పిన విషయాలు తన హృదయాన్ని కదిలించాయని చెప్పారు.

నాకు గురువులు

నాకు గురువులు

ఏ మతం హింసను బోధించదని, మహిళల్ని వేధించమని చెప్పదని హకీం చెప్పారని పవన్ అన్నారు. ఇలాంటి మాటలు జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని, వాటిని అధిగమించిన వారి నుంచి వస్తాయని, ఇలా నిజాలు చెప్పే వ్యక్తులు తనకు గురువులు అని పవన్‌ పేర్కొన్నారు. ఆయన ముస్లీం కావడంతో ఇటీవల మక్కా సందర్శించారని చెప్పారు. ఎవ్రీ డే హీరోకు గూగుల్‌లోని డెఫినేషన్ అంటూ మరో పోస్ట్ పెట్టారు.

English summary
'Every time I visit London, Hakim helps chauffeur me around. Hakim hail from Bangladesh and setteled in London with family' Pawan Kalyan posted in Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X