వైసీపీకి ఎమ్మెల్యేల గెలుపుకు సాయం చేస్తున్న ఆ టీడీపీ మాజీ మంత్రి ?

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి తన జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల గెలుపుకు సాయం చేస్తే..? ఆ ఊహ కూడా కష్టమే. కానీ అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం ఇదే నిజం అంటున్నారు. అంతే కాదు సదరు మాజీ మంత్రి ఎక్కడెక్కడ ఎలా సాయం చేస్తున్నాడో కూడా ఇవాళ వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెల్చుకుంది. మరోసారి ఇదే ఫీట్ రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం వైసీపీ పడే కష్టం పడుతుందో లేదో తెలియదు కానీ టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ మాత్రం బాగా కష్టపడుతున్నారట. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు గతంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమను ఆయన సొంత నియోజకవర్గం మైలవరంలో భారీ మెజారిటీతో ఓడించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

mylavaram mla vasantha krishnaprasad explains how tdps devineni uma helps ysrcp

మాజీ మంత్రి దేవినేని ఉమ పై ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఇవాళ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనకు ఇన్స్పిరేషన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి గెలిచిన కృష్ణ ప్రసాద్ కు అంత బలుపా అని ఉమా మాట్లాడుతున్నాడని వసంత పేర్కొన్నారు. అవును వసంత కృష్ణ ప్రసాద్ కు బలుపే అన్నారు.
నువ్వు నాలుగు సార్లు గెలిచినా.. నీ గెలుపు ఎటువంటి గెలుపో చెప్పాలని ప్రశ్నించారు. తనది అన్న వదినల బలిదానంతో నువ్వు గెలిచిన గెలుపు లాంటిది కాదని దేవినేని ఉమపై వసంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2019లో మంత్రి గా ఉన్న నిన్ను 13000 వేల మెజారిటీ తో గెలిచిన గెలుపు అసలైన గెలుపంటూ దేవినేనిని ఉద్దేశించి వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు తాను కూడా ప్లాట్లు అమ్మానని, భూములు అమ్మానని, అపార్ట్ మెంట్ కట్టి అమ్మి ఇంత ఎదిగానని కృష్ణ ప్రసాద్ తెలిపారు. దేవినేని ఉమా ఏం వ్యాపారం చేశావో చెప్పాలన్నారు.
దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని, గన్నవరం నియోజకవర్గానికి చెందిన దేవినేని కుటుంబం కంచికచర్ల లో కూల్ డ్రింక్స్ పెట్టుకుని బ్రతికారన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఉమ ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎలా పోటీచేశారన్నారు.

మంత్రి మల్లారెడ్డిలాగా పూలు అమ్మావా పాలు అమ్మావా చెప్పాలని దేవినేని ఉమను కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. ఇసుక, మట్టి, అమ్ముకోవడం తప్ప నువ్వు ఏ వ్యాపారం చేశావో చెప్పాలన్నారు. దేవినేని ఉమ వైసీపీ పార్టీకి అనుకూల శత్రువన్నారు.
దేవినేని ఉమ లాంటి నాయకుడు ఉండబట్టే కృష్ణాజిల్లా తెలుగు దేశం పార్టీ కకావికలం అయ్యిందని వసంత తెలిపారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ,ఇతర టీడీపీ నాయకులకు టీడీపి వీడి వైసీపీలోకి రావడానికి కారణం దేవినేని ఉమే అన్నారు. టీడీపీలో ఉన్న క్రియాశీలక నాయకులు పనిచేయకపోవడాని కారణం దేవినేని ఉమా అని ఆరోపించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా దేవినేని ఉమ సపోర్ట్ కావాలన్నారు. దేవినేని ఉమ నియోజకవర్గం వచ్చి వెళ్ళినప్పుడల్లా 500 టీడీపీ ఓట్లు పోవడం ఖాయమని వసంత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+