సింగపూర్ వ్యాఖ్యకు కిరణ్ హైద్రాబాద్ కౌంటర్ (ఫొటోలు)
కాకినాడ: రాష్ట్రాన్ని ఇంకా సమైక్యంగా ఉంచడానికే తన ప్రయత్నమంటూ మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన పార్టీ భవిష్యత్తుపై ఏ మాత్రం అంచనాలు లేకపోయినప్పటికీ ఆయన ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు జాతికి తీవ్ర నష్టం జరిగిందని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విభజనకు కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు కారణమని మండిపడ్డారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇచ్చిన లేఖల వల్లే విభజన జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర సమైక్యత కోసం తాను ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నానని కిరణ్ ప్రజలకు తెలిపారు. పదవీత్యాగం చేస్తే తనను స్వార్థపరుడని కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. సీమాంధ్రను సింగపూర్‌లాగా తయారు చేస్తామని అంటున్నారని, కానీ తమ హైదరాబాద్ తమకు కావాలని ఆయన అన్నారు.

జగ్గంపేటలో కిరణ్ రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు.

జగ్గంపేటలో కిరణ్ రెడ్డి
మండుటెండలో తలపై టోపీ పెట్టుకుని ఆయన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రచారం నిర్వహించారు. తమ హైదరాబాదు తమకు కావాలని ఆయన అన్నారు.

జగ్గంపేటలో కిరణ్ రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రచారం నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డితో స్థానికులు చేతులు కలపడానికి ఉత్సాహం ప్రదర్శించారు.

జగ్గంపేటలో కిరణ్ రెడ్డి
తన పార్టీ అభ్యర్థుల కోసం జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే అయి ప్రచారం సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications