అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

nadendla manohar: పుంగనూరులో ఏం జరిగింది?

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త, జనసేన నేత రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి.. వైసీపీ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని మరోసారి బయటపెట్టిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతు సభ నిర్వహించాలనుకోవడమే రామచంద్ర యాదవ్‌ చేసిన నేరమా? అని మనోహర్ నిలదీశారు. ఆయనపై జరిగిన దాడిని ఖండించారు.

ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా?

ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా?


ప్రశ్నిస్తే.. ఎదురిస్తే గొంతు నొక్కేస్తారా? ఆస్తులు ధ్వంసం చేస్తారా? రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ మూకలు దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మనోహర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోకూడదా? అవి నిషిద్ధమా? అని ప్రశ్నించారు. వైసీపీ వికృత రాజకీయ క్రీడలో ఇది కూడా ఓ భాగమని, ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యం పై జరిగిన దాడిగా దీన్ని భావిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అందరూ ఖండించాలని మనోహర్ పిలుపునిచ్చారు.

పుంగనూరులో ఏం జరిగింది?

జనసేన నేత రామచంద్రయాదవ్ నేతృత్వంలో పుంగనూరు నియోజకవర్గ రైతు సమస్యలపై రైతుభేరి తలపెట్టారు. దీనికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో రామచంద్రయాదవ్ పుంగనూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. వైసీపీకి వ్యతిరేకంగా సభ తలపెట్టారంటూ రాత్రి వైసీపీ కార్యకర్తలు పుంగనూరు పట్టణంలోని కొత్తిండ్లు ఎల్ఐసీ కాలనీలో రామచంద్ర యాదవ్ ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు.

కర్రలు, రాళ్లతో దాడి

కర్రలు, రాళ్లతో దాడి

కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలగొట్టి లోపలకు వెళ్లి, ఫర్నిచర్‌ను విరగ్గొట్టారు. ఇంటి ఆవరణలోని ఆరు కార్లను ధ్వంసం చేశారు. రామచంద్ర ఓ గదిలో ఉండి ప్రాణాలు దక్కించుకున్నారు. తమ నాయకుడు సదుం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ శ్రేణులు ఇంత విధ్వంసానికి దిగినా కళ్లప్పగించి చూస్తుండిపోయారని రామచంద్ర మద్దతుదారులు మండిపడ్డారు.

English summary
Janasena political affairs committee chairman Nadendla Manohar said that the attack on the house of industrialist and Janasena leader Ramachandra Yadav in Punganur of Chittoor district has once again revealed the ideology of the YCP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X