BJP కంటే TDP బెటర్?... నాదెండ్ల మనోహర్ హితబోధ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీతో అరగంట భేటీ అయ్యారు. దాంతో రాష్ట్ర రాజకీయం మొత్తం మారిపోయింది. వీరిద్దరి భేటీకి సంబంధించి పలురకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడే సమయంలో పవన్ కల్యాణ్ కూడా ముభావంగా, నిరాశగా ఉండటాన్ని బట్టి టీడీపీతో వెళ్లొద్దని మోడీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

 సలహాను పట్టించుకోని నాదెండ్ల?

సలహాను పట్టించుకోని నాదెండ్ల?

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రం మోడీ ఇచ్చిన సలహాను పట్టించుకోలేదని జనసేన వర్గాలు వెల్లడించాయి. వైసీపీ విముక్త ఏపీకోసం సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చేసిన ప్రకటనను విశ్లేషకులు ఉదాహరణగా చూపుతున్నారు. తమది రౌడీసేన ఎలా అవుతుందని ముఖ్యమంత్రి జగన్ నర్సాపురంలో చేసిన వ్యాఖ్యలకు మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పేరుకు మాత్రమే బీజేపీ ఉందని, ఎన్నికల సమయంలో బీజేపీతో నడుచుకోకుండా సొంత నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీలోని సీనియర్ నేతలు కూడా జనసేనానికి చెప్పినట్లు తెలుస్తోంది.

తొందరపాటు నిర్ణయాలొద్దన్న మోడీ?

తొందరపాటు నిర్ణయాలొద్దన్న మోడీ?


తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని నరేంద్రమోడీ పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన సలహాను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ నాదెండ్ల మనోహర్ తోపాటు సీనియర్ నేతలు కూడా పట్టించుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీచేయాలని, లేదంటే బీజేపీతో పొత్తు కొనసాగించాలని మోడీ కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీచేయడానికి కావల్సిన అన్ని విషయాలను తమ పార్టీ చూసుకుంటుందని, జనసేనకు బీజేపీ అన్నివిధాలుగా సహాయపడుతుందనే హామీని ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు రాలేకపోతే ఎప్పటికీ రాదు..

ఇప్పుడు రాలేకపోతే ఎప్పటికీ రాదు..


2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ తర్వాత రాలేదని, చంద్రబాబుకు 80 సంవత్సరాల వయసు వస్తుందని, ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారనేది భారతీయ జనతాపార్టీ నేతల వాదనగా ఉంది. అలా అయితేనే పవన్ కల్యాణ్ ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకొని నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే బీజేపీతోపాటు జనసేననున కూడా ఎదగనివ్వడని హితబోధ చేస్తున్నారు.

జనసేనను పణంగా పెట్టి బీజేపీ..

జనసేనను పణంగా పెట్టి బీజేపీ..


చంద్రబాబునాయుడు అవసరానికి మాత్రమే ఇతర రాజకీయ నాయకులకు ఉపయోగించుకుంటారని, మీరు కూడా అలా ఉంటే మంచిది కాదని చెబుతున్నారు. అయితే ఏపీలో పేరుకు మాత్రమే ఉన్న బీజేపీతో నడుచుకోకుండా సొంత నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీని పణంగా పెట్టి బీజేపీ ఎదగాలనుకుంటోందని, రానున్న ఐదు సంవత్సరాలు కూడా జగన్ అధికారంలో ఉండేలా చూడాలన్నదే బీజేపీ జాతీయ నాయకత్వం ఉద్దేశమని పలువురు నేతలు కూడా పవన్ తో చర్చించారు. జనసేనాని తీసుకునే నిర్ణయాన్ని బట్టే రానున్న ఎన్నికల్లో అధికారం ఎవరిదనేది స్పష్టమవుతుంది. అప్పటివరకు వేచిచూడాల్సిందే.!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+