Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు తో పవన్ భేటీ లో జరిగిందిదే, జరిగేదిదే : నాదెండ్ల..!!

ఏపీ రాజకీయాల్లో మరోసారి టీడీపీ - జనసేన పొత్తు చర్చకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ తో ఈ రెండు పార్టీల పొత్తు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. మే ద్వితీయార్ధంలో పొత్తుల పైన రెండు పార్టీల అధినేతలు స్పష్టత ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ ఇద్దరి నేతల భేటీ వెనుక కారణాలను జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. భవిష్యత్ లోనూ మరిన్ని భేటీలు కొనసాగుతాయని స్పష్టం చేసారు.

ఇద్దరి నేతల భేటీలో : ఏపీలో వచ్చే నెల రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు, పవన్ భేటీలో ఒక వైసీపీ ప్రభుత్వం పైన రాజకీయంగా ఒత్తిడి పెంచే కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు కొనసాగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 nadendlamanohar

బీజేపీ నేతల నిర్ణయానికి అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఇద్దరు నేతలు సిద్దం అవుతున్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు పొత్తుల పైన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ ప్రకటించేందుకు రంగం సిద్దం అవుతున్నట్లు సమాచారం.

మనోహర్ కామెంట్స్ : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ పైన జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాబోయే ఎన్నికలకు పవన్‌ సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే చంద్రబాబుతో చర్చలు జరిపారన్నారు. ప్రజలకు నమ్మకమైన, ప్రత్యామ్నాయం ఏర్పాటుకు జనసేన ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండాఉండేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాము పదవుల కోసం కాదని, ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. భవిష్యత్‌లో మరికొన్ని సమావేశాలు జరుగుతాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని మనోహర్ చెప్పుకొచ్చారు. జగనన్నా నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్లు అంటిస్తున్నారని, జగన్ నమ్మకం కోల్పోయారని మనోహర్ వ్యాఖ్యానించారు.

 cbnpk

బీజేపీ నిర్ణయం కోసం : బీజేపీని తమతో కలిసి వచ్చేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ ఇదే అంశం పైన ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బీజేపీ నేతల నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన రాలేదని సమాచారం.

కర్ణాటక ఎన్నికల తరువాత మరోసారి బీజేపీ నేతలతో సమావేశమై తన నిర్ణయం ప్రకటించేందుకు పవన్ సిద్దమవుతున్నారని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలని డిసైడ్ అయ్యారు. పొత్తుల పైన నిర్ణయం వచ్చిన వెంటనే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేది ఇద్దరి నేతల నిర్ణయంగా సమాచారం. దీంతో, ఏపీ రాజకీయాల్లో మే నెల కీలకం కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+