వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాదెండ్ల మనోహర్ కు ఆ రెండింటిలో ఒకటివ్వబోతున్న తెలుగుదేశం?

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్నడూ లేనివిధంగా తన సహజ స్వభావానికి విరుద్ధంగా అధినేత చంద్రబాబునాయుడు దూకుడైన రాజకీయం చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో జరిగిన పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి సంఘీభావం తెలియజేశారు.

టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు

టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు

అప్పటివరకు టీడీపీ-జనసేన మధ్య పొత్తుంటుందా? ఉండదా? అంటూ రాజకీయవర్గాలతోపాటు రెండు పార్టీల శ్రేణుల్లో మీమాంశ ఉండేది. అయితే దాదాపుగా పొత్తు ఖాయమని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని ఒక స్పష్టత రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు బిజీ అయ్యారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారు? అటువంటి నియోజకవర్గాల్లో తాము ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ వస్తున్నాం కదా..?.. ఏ నిర్ణయం తీసుకుంటారు? లాంటి సందేహాలన్నీ టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.

గత ఎన్నికల్లో మూడోస్థానంలో మనోహర్

గత ఎన్నికల్లో మూడోస్థానంలో మనోహర్


జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గత ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించడంతోపాటు డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. అనంతర పరిణామాల్లో జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు. తనకున్న గత పరిచయాలతోపాటు పవన్ అభిమాలను కలుపుకొని 29,905 ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఆయన జనసేన రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

తెనాలి కాకపోతే గుంటూరు పశ్చిమ?

తెనాలి కాకపోతే గుంటూరు పశ్చిమ?


తెనాలిలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఒకవేళ మనోహర్ కోసం సీటు కేటాయించాల్సి వస్తే తెనాలికానీ, గుంటూరు పశ్చిమ కానీ ఇవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. తెనాలిలో టీడీపీ పోటీచేస్తుందనే ప్రతిపాదనలుంటే గుంటూరు పశ్చిమను కేటాయించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన మద్దాలి గిరి వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోసం టీడీపీ పట్టుబడితే మనోహర్ ను గుంటూరు పశ్చిమ నుంచి జనసేన తరఫున పోటీచేయించే అవకాశం ఉంది. ఒకవేళ తెనాలి నుంచే పోటీచేస్తానని నాదెండ్ల పట్టుబడితే ఆలపాటిని గుంటూరు పశ్చిమ నుంచి పోటీచేయించే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఏదైనా అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఒక స్పష్టత రానుంది. అప్పటివరకు ఎదురుచూడటమే.!!

English summary
There is a possibility that Manohar will contest from Guntur West on behalf of Jana Sena if TDP gets hold of Alapati Rajendra Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X