నాగబాబు కూడా తగులుకున్నాడు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‎ చిక్కుల్లో పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆయనకు పరువు నష్టం నోటీసు జారీ చేశారు. ప్రకాష్ రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఈ నోటీసును పంపారు. ఇందులో పలు డిమాండ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వారం రోజుల్లో ప్రకాష్ రాజ్ నెరవేర్చాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కేరళలో ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ సీతారామలక్ష్మణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాదికి చెందిన రామలక్ష్మణులు దక్షిణాది రీజియన్ కు చెందిన లంకపై దండయాత్ర చేసినట్లుగా రామాయణాన్ని వక్రీకరించారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇది ఇతిహాసాన్ని తీవ్రంగా వక్రీకరించడమేనని పేర్కొన్నారు.

Nagababu Drops Sharp Hit on Prakash Raj Over Rama Remarks Sparks Buzz on Social Media

ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. షార్ప్ అటాక్ కు దిగారు. శ్రీరాముడు హిందువులకు దైవం మాత్రమే కాదని, ఆయన ధర్మానికి, నిత్య సత్యానికి, న్యాయానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ఇటువంటి అహంకారపూరక మాటలు మాట్లాడేవాళ్లు, అజ్ఞానులు మాత్రమే శ్రీరాముడిని కించపర్చుతారని వ్యాఖ్యానించారు. అటువంటి వారు తమను తాము మాత్రమే నిందించుకున్నట్టవుతుందని చెప్పారు. "

ధర్మం అవిచ్ఛిన్నమైనదని, దాని రక్షకులు అజేయులని నాగబాబు అన్నారు. ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన వారిని చరిత్రే నాశనం చేసిందని, రాముడిపై విషం చిమ్మేవారికి కూడా అదే గతి పడుతుందని శపించారు. "రామనామం ఓ కవచం, ఆయన కథ ఒక ఖడ్గం, ఆయన ఉనికి మన నాగరికతకు అచంచలమైన కోట" అని స్పష్టం చేశారు.

నాగబాబు చేసిన ట్వీట్ కు నెటిజన్లు కూడా అంతే ఘాటుగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2021 ఆగస్టు 26న నాగబాబు చేసిన ఓ ట్వీట్ స్క్రీన్ షాట్ ను సర్కులేట్ చేస్తోన్నారు సోషల్ మీడియా యూజర్లు. దేవుడిని అహంకారి, శాడిస్ట్, అహంభావి, సైకోపాథిక్, మాసోకిస్ట్ గా అభివర్ణిస్తూ చేసిన ట్వీట్ అది. దేవుడనే వాడు లేనే లేడని నాగబాబు అప్పట్లో ఈ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన బీజేపీలో చేరడం, ఆ పార్టీకి అనుగుణంగా నాగబాబు హిందుత్వ అజెండాను ఎత్తుకోవడం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+