"తమ్ముడు" కోసం అన్నయ్య : అందుకే దూరంగా ఉన్నా: జనసేన పై మెగా హీరో..!
తమ్ముడు పవన్ కళ్యాన్ కోసం అన్నయ్య నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పవన్ కు మద్దతుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సొంత యూ ట్యూబ్ ఛానల్ తో టిడిపి..వైసిపి లను పరో క్షంగా టార్గెట్ చేస్తున్న నాగబాబు..ఇప్పుడు జనసేన కార్యకర్తలతో సమావేశాలు ప్రారంభించారు.
జనసైనికులతో నాగబాబు సమావేశం..
జనసేన పార్టీ కార్యకర్తలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. గుంటూరు లో జరిగిన ఈ సమావేశం లో పార్టీ స్థితి గతు ల గురంచి నాగబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీలోకి ముఖ్య నేతలకు..హాజరు కావాల్సిన వారికి మాత్రమే దీని పై సమాచారం అందించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం.. పార్టీ అభ్యర్ధుల ప్రకటన పై పవన్ కళ్యాన్ దృష్టి సారించటం తో ఇప్పుడు నాగబాబు సైతం పార్టీ పై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి తనయుడు రాం చరణ్ ఓపెన్‌గా బాబాయ్ కు తన మద్దతు ఉంటుందని ప్రకటించా రు. ఇక, మెగా ఫ్యామిలీలో హీరోలు పవన్ కు తమ మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు నాగబాబు ప్రత్యక్షం గా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనటం ద్వారా తన మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు.

అందుకే దూరంగా ఉన్నాను..
పార్టీ కార్యకర్తల సమావేశంలో నాగబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను జనసేన కార్యకర్తను మాత్ర మే అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ఏపిలో జనసేన కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ నాగ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసేన అధినేత పవన్ పై బంధుప్రీతి ముద్ర వేస్తారనే కారణంతోనే తాను జనసేనకు దూరంగా ఉన్నానని నాగబాబు చెప్పుకొచ్చారు. గతంలో పవన్ కళ్యాన్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యల దుమారం జరిగినప్పుడూ పవన్ కు మద్దతుగా నాగబాబు ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు. పవన్ కు అండగా నిలుస్తామని అనేక సందర్భాల్లో మెగా హీరోలు ప్రకటిస్తూ వచ్చారు. ఇక, ఇప్పుడు నాగబాబు నేరుగా కార్యకర్తలతో సమావేశం కావటం ద్వారా..రానున్న రోజుల్లో ఆయన పార్టీలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications