వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిపై తెలియకే, జగన్ జాగ్రత్తగా ఉండాలి, ఊహించింది రివర్స్ కావడంవల్లే: నాగబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ మాటలపై నాగ బాబు స్పందన

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై నాగబాబు ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ పార్టీ అధినేతగా కొంత సంయమనం పాటించాల్సి ఉంటుందని అన్నారు.

ఇక వదిలేయండి, జగన్ ఇంటి ఆడపడుచుల్ని లాగకండి: పవన్ కళ్యాణ్ఇక వదిలేయండి, జగన్ ఇంటి ఆడపడుచుల్ని లాగకండి: పవన్ కళ్యాణ్

పార్టీలో మిగతా వారు నోటికి వచ్చినట్లు మాట్లాడినా, అర్థం లేకుండా మాట్లాడినా ఇబ్బంది లేదని, కానీ పార్టీ అధినేత నోరు జారవద్దని, జాగ్రత్తగా ఉండాలని (జాగ్రత్తగా మాట్లాడాలని) అన్నారు. జగన్ మాట జారారని చెప్పారు. సరైన అవగాహన లేకుండా మాట్లాడారన్నారు.

జగన్‌కు పెళ్లిపై అవగాహన లేకుండా మాట్లాడారు

జగన్‌కు పెళ్లిపై అవగాహన లేకుండా మాట్లాడారు

పవన్ కళ్యాణ్ పెళ్లి విషయమై సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని నాగబాబు చెప్పారు. ఎవరినో పెళ్లి చేసుకుంటానని వదిలేయడం పవన్ చేయలేదన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పవన్ పెళ్లిపై అర్థంలేని చర్చ చేపడుతున్నారన్నారు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు కూడా సరిగా మాట్లాడలేదన్నారు.

రేణుదేశాయ్, మొదటి అమ్మాయి మాట్లాడలేదు

రేణుదేశాయ్, మొదటి అమ్మాయి మాట్లాడలేదు

పవన్ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని నాగబాబు చెప్పారు. ఆ రెండు పెళ్లిళ్లు కూడా ఎందుకు కుదరలేదనేది భార్యాభర్తలకు సంబంధించిన విషయమని చెప్పారు. మర్యాదగా, చట్టబద్ధంగా పవన్ వారితో విడిపోయారని చెప్పారు. కానీ వాటిని ఇష్యూ చేసుకోలేదన్నారు. మొదటి అమ్మాయి, రేణుదేశాయ్ కూడా వీటి గురించి మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఏదో ఒకటి రెండు మాటలు ఇంటర్వ్యూలో వేరు అన్నారు.

ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు

ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు

చట్టబద్ధంగా వారు విడిపోయారని నాగబాబు అన్నారు. కానీ దానిని పెద్ద ఇష్యూ చేయడం విడ్డూరమన్నారు. పవన్ కళ్యాణ్ న్యాయబద్ధంగా జీవిస్తున్నాడని, అలాంటి వ్యక్తి పట్ల ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తమకు అర్థం కావట్లేదన్నారు. పెళ్లిళ్లు చేసుకొని, వేర్వేరు అక్రమ సంబంధాలు ఉంటే సరైన చర్యనా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్‌ను విమర్శించేందుకు అస్త్రాలు లేకే

పవన్ కళ్యాణ్‌ను విమర్శించేందుకు అస్త్రాలు లేకే

వారిది పొలిటికల్ అజెండా అని, పవన్ కళ్యాణ్‌ను ఏమీ అనలేక ఈ అంశం తెచ్చారని నాగబాబు అన్నారు. రాజకీయంగా ఎవరినైనా విమర్శించాలంటే ఓ పాయింట్ కావాలని, కానీ పవన్‍‌ను విమర్శించేందుకు ఏ పాయింట్ లేదని, దీంతో వైవాహిక సంబంధం గురించి మాట్లాడుతున్నారన్నారు. కానీ వైవాహిక జీవితంలో పవన్ అక్రమంగా ఏదీ చేయలేదని, అన్ని న్యాయబద్దంగానే చేశారన్నారు. పవన్‌ను ఏమనలేకే అలా అన్నారు.

జగన్ అందుకే అలా మాట్లాడారు

జగన్ అందుకే అలా మాట్లాడారు

జగన్ ఎందుకు అలా మాట్లాడి ఉంటారని అంటే.. ఎక్కడో అతను అభద్రతా భావానికి లోనయ్యారని నాగబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ లేదా వైసీపీ పవన్‌ను చాలా తక్కువగా అంచనా వేసి ఉండవచ్చునని, పవన్ వల్ల తమకు లబ్ధి చేకూరుతుందని ఇరు పార్టీలు భావించి ఉంటాయని, కానీ ఏపీలో ఆయన బలంగా తయారవుతున్నాడని, కాబట్టి వారికి అభద్రతా భావం పట్టుకుందన్నారు. ఇలాంటి సమయంలో పవన్ హవాను తగ్గించేందుకు వారి వద్ద ఎలాంటి అస్త్రాలు లేవని, స్కాంలు లేవు, మాఫియాలు లేవు.. కాబట్టి దీనిని తీసుకు వచ్చారని నాగబాబు అన్నారు. బయటి వ్యక్తులు మాట్లాడినా, జగన్ మాట్లాడినా.. పవన్‌ను తగ్గించడమే వారి ఉద్దేశ్యమన్నారు.

English summary
Nagababu responded on YSR Congress Party chief YS Jagan Mohan Reddy's bridegroom forever comments on Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X