రోజాపై నగరి ప్రజలు, సొంత పార్టీ నేతల గుర్రు: ఎందుకంటే..?

Subscribe to Oneindia Telugu

అమరావతి: సినీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగిన రోజా.. రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇంతుకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆమె సొంతం. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.

సందర్శన కరువే..

సందర్శన కరువే..

ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కొంతకాలం నుంచి నగరి నియోజకవర్గం ప్రజలు మాత్రం తమ ఎమ్మెల్యే రోజాపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపొందిన నాటి నుంచి ఆమె నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు అత్యంత స్పల్పమేనని నియోజకవర్గ ప్రజలంటున్నారు. ఈ విషయాన్ని రోజా సొంత పార్టీ నేతలు కూడా అంగీకరిస్తుండటం గమనార్హం.

ప్రజల ఆగ్రహం

ప్రజల ఆగ్రహం

ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదంటే నగరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజా తీరు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారట.

అధినేత వద్దకు..

అధినేత వద్దకు..

అధినేతను కలిసి.. ఎమ్మెల్యేకి కావాల్సిన నిధులు వస్తున్నా.. సరైన పర్యవేక్షణ లేకపోవడం, పూర్తి స్థాయిలో రోజా నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారనే విషయాన్ని అధినేతకు వివరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ప్రజల నిలదీతతో..

ప్రజల నిలదీతతో..

ప్రజలు తమ సమస్యలపై స్థానికంగా ఉండే నేతలనే నిలదీస్తుండటంతో వారు ఏమీ చేయలేకపోతున్నారట. మరోవైపు ప్రభుత్వం కూడా నగరి నియోజకవర్గానికి అనుకున్నంత నిధులు కూడా ఇవ్వడం లేదని నేతలు ఆరోపిస్తున్నారు. నగరి నియోజక వర్గానికి సంబంధించిన అన్ని సమస్యలతోపాటు రోజా విషయాన్ని కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు నగరి వైసీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరి ఏమవుతుందో వేచి చూడాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nagari constituency people disappointed with roja, due to she has not coming to their constituency.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి