వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్ల్యూఈఎఫ్ మీట్: దావోస్‌కు వెళ్లనున్న చంద్రబాబు బృందం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు రంగం సిద్ధమైంది. జనవరి 19 నుంచి 24 వరకూ దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు సిఎంతోపాటు పదిమంది బృందం పర్యటించనుంది.

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో సిఎం బృందం పర్యటన చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు.

chandrababu

సీఎం బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్‌బాబు, సిఎం కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఐఅండ్‌సి శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిఇఓ జాస్తి కృష్ణకిశోర్, పెండ్యాల శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ అధికారి ముద్రగడ నాగేంద్రరావు ఉన్నారు.

19న ఈ బృందం బయలుదేరి 24 వరకూ పర్యటిస్తుంది. ఈ మేరకు కేంద్ర అనుమతి కూడా పొందింది. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సిఎం ప్రతినిధి బృందం పెట్టుబడులు ఆకర్షించేందుకు అభివృద్ధి కార్యక్రమాలను వివరించనుంది.

English summary
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu will participate in the annual meeting of the World Economic Forum to be held at Davos in Switzerland from January 19 to 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X