ఇప్పుడు సిద్దమా- ! జగన్ కు చంద్రబాబు అసెంబ్లీ సవాల్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాది పాలన పూర్తయ్యే వరకూ ఒక్క పెన్షన్ల మినహా మిగిలిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ తెగ విమర్శలు చేసేది. అయితే వైసీపీ విమర్శలకు చెక్ పెట్టాలన్న పట్టుదలో లేక సర్వే నివేదికల హెచ్చరికల ఫలితమో కానీ సీఎం చంద్రబాబు గత రెండు నెలల్లో వరుసపెట్టి సంక్షేమ పథకాల జాతరకు తెరలేపారు. వరుసగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు వంటి కీలక పథకాలు అమలు చేసేశారు. ఇప్పుడు వైసీపీకి ఆయన కీలక సవాల్ విసిరారు.
ఇవాళ రాజంపేటలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ .. వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ నేతలు మాట్లాడితే సిద్ధం.. సిద్ధం.. అనే వారని ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపై,సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ చేశారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని ఆయన తెలిపారు.

అభివృద్ధితో పాటు వివేకా హత్య, గులకరాయి డ్రామాపైనా చర్చకు సిద్దమా అని వైసీపీ ఎమ్మెల్యేల్ని చంద్రబాబు ప్రశ్నించారు.
తన రాజకీయ జీవితంలో ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదని ఆయన తెలిపారు. 30 ఏళ్లుగా ఒక మిషన్‌లా పనిచేస్తూనే ఉన్నానన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తన ప్రభుత్వ లక్ష్యమని, జీతాలతో పాటు పెన్షన్లు కూడా సకాలంలో ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయన్నారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తానన్న వైసీపీకి అధికారం ఇస్తే సొంత పనులకు వినియోగించుకున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications