'అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయం'
దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్ తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ మేరకు రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించటంపై ప్రత్యేకంగా అభినందించారు.
ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు దుబాయ్ పర్యటనలో భాగంగా దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్ తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. పీ4లో విధానంలో జీరో పావర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను సీఎం చంద్రబాబు వివరించారు.
అమరావతి రాజధాని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు సీఎం తెలిపారు.
రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు.
ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని ఈ మేరకు పీఎన్సీ మీనన్ ను సీఎం చంద్రబాబు కోరారు. శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అంటూ సీఎం పేర్కొన్నారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు లాంటి మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతాయని వెల్లడించారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్నాయని ఈమేరకు సీఎం చంద్రబాబు తెలిపారు.

అలాగే ఏపీలోని తిరుపతి, విశాఖ, అమరావతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని సీఎం వివరించారు. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలను, కార్యక్రమాలను శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ మీనన్.. సీఎం చంద్రబాబుకు గుర్తు చేశారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని మీనన్ కు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు.












Click it and Unblock the Notifications