
నైషధం శివరామ శాస్త్రి జ్యోతిష్యం మానేస్తారా... టీడీపీ ఓటమి, పవన్ గెలవలేదు
ఏపీలో ఎన్నికలు ముగిసినతర్వాత ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, మంత్ర శాస్త్రనిపుణుడు నైషధం శివరామశాస్త్రి. ఈ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు . మెుత్తం 112 సీట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని మళ్లీ సీఎం పీఠం చంద్రబాబుదేనన్నారు శివరామ శాస్త్రి . ఇక ఆ విషయాన్ని తాను రూ.100 బాండ్ పేపర్ మీద రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతే కాదు ఒకవేళ ఇది నిజం కాకుంటే తాను జ్యోతిష్యం మానేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు నైషధం వారు చెప్పిన లెక్కలు తప్పయ్యాయి. టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది . వైసీపీ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోయింది. మరి నైషధం వారు చెప్పిన మాట నిలబెట్టుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు.
జ్యోతిష్య పండితుడు నైషధం చెప్పిన లెక్కలన్నీ తప్పే
ఎన్నికలకు ముందు ఒక ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు గెలుస్తారని తెలిపారు. వైసీపీకి 58 సీట్లు మాత్రమే వస్తాయని ఆయన లెక్క చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గాజువాకలో మాత్రమే గెలుస్తారని చెప్పిన ఆయన గాజువాకలో పవన్ కళ్యాణ్ 57,600 మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. ఇది నిజం అన్నారు. ఒకవేళ కాకపోతే తాను జ్యోతిష్యం మానేస్తానని సవాల్ విసిరారు నైషధం శివరామ శాస్త్రి . కానీ ఆయన చెప్పిన వాటిలో ఒక్కటంటే ఒక్క లెక్క కూడా కరెక్ట్ కాలేదు. అందుకే నైషధం శివరామ శాస్త్రి జ్యోతిష్యం మానెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మాట మీద నిలబడాలని కోరుతున్నారు.

అభాసుపాలైన నైషధం శివరామశాస్త్రి జ్యోతిష్యం
నైషధం శివరామశాస్త్రి ఎన్నికలకు ముందు వేసిన సవాల్ పై హేతువాద సంఘం నాయకులు స్పందించారు. ఇదే నిజమైతే రూ.5లక్షలు బహుమానంగా ఇచ్చి శివరామశాస్త్రిని ఊరేగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే హేతువాద సంఘం నాయకుల ఆఫర్లను తిరస్కరించిన శివరామశాస్త్రి తాను చెప్పిందే నిజమవుతుంది . అప్పుడు చెంపలేసుకుని, తిరుమల వేంకటేశ్వరస్వామికి అంగ ప్రదక్షణ చేస్తే చాలని సూచించారు. కానీ నైషధం వారి జ్యోతిష్యం అభాసుపాలైంది. ఆయన తప్పులో కాలేశారు. ఇప్పుడు ఎందుకు లేనిపోని సవాల్ చేశామా అని తల పట్టుకుంటున్నారు. ఏదిఏమైనా సంచలనం సృష్టించిన నైషధం వారు ఈ సమయంలో ఏం చెయ్యనున్నారో మరి.