Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి: రోదించిన భార్య, ఆస్పత్రిలో కొడుకు

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురంలో ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం తుది శ్వాస విడిచిన ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో జడ్చర్ల శోకసంద్రమైంది.

జడ్చర్ల పాతబజార్‌లో ఉన్న శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో సిద్ధయ్య మృతదేహాన్ని ఖననం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో సిద్ధయ్య అంత్యక్రియలను నిర్వహించారు. జడ్చర్లలో ప్రారంభమైన ఈ అంతిమయాత్రలో పెద్ద ఎత్తున స్ధానికులు పాల్గొన్నారు. కడసారి ఆయన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు.

Nalgonda encounter SI Siddaiah funeral started at Jadcherla

భర్త మృతదేహాన్ని చూసి సిద్ధయ్య భార్య ధరణిష కన్నీరు మున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రి నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయిన ఆమె భర్త అంత్య క్రియలకు జడ్చర్లకు వచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన ఆయన భార్య బోరున విలపించింది. ధరణీశ అక్కడికి రావడంతో విషాదకర వాతావరణం నెలకొంది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సిద్ధయ్య మరణించినప్పటి నుంచి అంతిమ యాత్ర వరకు అంతా విషాదమే. తనకి కొడుకు జన్మించాడన్న విషయం తెలియకుండానే సిద్ధయ్య మృతి చెందాడు. దీంతో కంటితో చూడకపోయినా తన కొడుకు చేతితో స్పర్శ చేయించారు కామినేని వైద్యులు.

Nalgonda encounter SI Siddaiah funeral started at Jadcherla

సిద్ధయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన భార్య ధరణిష అదే ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సిద్ధయ్య కుమారుడికి హృదయ సంబంధమైన సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో రెయిన్‌బో ఆస్పత్రిలో కుమారుడికి శస్త్ర చికిత్స చేశారు.

మరణించిన సిద్ధయ్య కుమారుడి గుండెలో ఉన్న రంధ్రానికి చేసిన రెయిన్ బో వైద్యులు ఆపరేషన్ సక్సెస్ అయింది. రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు చిన్నారి అన్నవాహిక, వాయునాళాన్ని వైద్యులు విజయవంతంగా వేరు చేశారు. దీంతో కుమారుడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

మంత్రులు, కాంగ్రెస్ నేతలు నివాళులు:

వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్యకు అటు పోలీసు ఉన్నాతాధికారులతో పాటు, రాజకీయనాయకులు నివాళులర్పించారు. వీరిలో మంత్రులు లక్షారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. వీరితోపాటు కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, డీకే అరణ, ఉత్తమ కుమార్ రెడ్డి తదితరులు సిద్దయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు

Nalgonda encounter SI Siddaiah funeral started at Jadcherla

ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ సిద్ధయ్య వీరణమరణం పొందారు. ఆయన మృతి తీరని లోటు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సిద్ధయ్య విధులు నిర్వహించారు. సిద్ధయ్య ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సిద్ధయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సిద్ధయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+