కిరణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకి
Recommended Video

హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైంది. గురువారం రాత్రి కిషోర్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అమరావతిలో కలుసుకొన్నారు. త్వరలోనే కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు.
చదవండి: టీడీపీలోకి సోదరుడు, అక్కడి నుంచే పోటీ: రాజకీయాల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఔట్?
చిత్తూరు జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఇందులో భాగంగానే వలసలను టిడిపి ప్రోత్సహిస్తోంది. చాలా కాలంగా నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డితో టిడిపి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంప్రదింపుల మేరకు కిషోర్ కుమార్ రెడ్డి చేరికకు రంగం సిద్దమైంది.
కిరణ్‌కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. జై సమైక్యాంద్ర పార్టీని ఏర్పాటు చేశారు కిరణ్‌కుమార్ రెడ్డి. ఆ పార్టీ తరపున కిషోర్‌కుమార్ రెడ్డి పోటీ చేశారు. కానీ, ఆయన ఓటమి పాలయ్యారు.
ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి ఆశాజనకంగా పరిస్థితులు లేవు. కిరణ్‌కుమార్ రెడ్డి బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆయన ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. కానీ, కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

చంద్రబాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి గురువారం రాత్రి అమరావతిలో చంద్రబాబును కలుసుకొన్నారు. టిడిపిలో చేరే విషయమై చంద్రబాబుతో చర్చించారు. త్వరలోనే కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు వీలుగా బాబుతో చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ స్థానం నుండి కిషోర్‌కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.ఈ నెల 23 లేదా 25వ, తేదిన కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరే అవకాశం ఉంది. సుమారు 40 మంది సర్పంచ్‌లతో కలిసి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు.

నల్లారి కిషోర్ రెడ్డి కోసం అమర్‌నాథ్ రెడ్డి ప్రయత్నాలు
నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డిని టిడిపిలో చేరేలా మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ప్లాన్ చేశారని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రిగా అమర్‌నాథ్ రెడ్డిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు టిడిపి నాయకత్వం నుండి కూడ సానుకూల సంకేతాలు వచ్చాయని సమాచారం. దీంతో సెప్టెంబర్ 18 నుండి కిషోర్‌కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు తన అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు.

కిషోర్‌కుమార్ రెడ్డి చేరికతో టిడిపికి లాభమేనా
చిత్తూరు జిల్లాలో వైసీపీ అత్యధిక స్థానాలను గత ఎన్నికల్లో గెలుచుకొంది. అయితే కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను టిడిపిలో చేరేలా ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కిషోర్‌కుమార్ రెడ్డికి టిడిపిలో మంచి పదవిని కూడ కట్టబెట్టే అవకాశాలు కూడ ఉన్నాయని టిడిపి నేతలు చెబుతున్నారు.

కిరణ్‌కుమార్ రెడ్డి
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైఖ్యాంద్ర పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిలలో కిరణ్‌కుమార్ రెడ్డి చేరుతారనే ప్రచారాలు కూడ సాగాయి.
-
కడప జిల్లాకు చంద్రబాబు -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications