అప్పుడు జూ.ఎన్టీఆర్, ఇప్పుడు కెసిఆర్: టిడిపి కుట్రనా?
హైదరాబాద్: సిఎన్ఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ఓటింగులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోసింది. ఈ మేరకు ఆ వార్తాపత్రిక శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా చేసినట్లుగా ఇప్పుడు కెసిఆర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించింది.
నమస్తే తెలంగాణ వార్తాకథనం ఇలా ఉంది - అందరూ ఊహించినట్టుగానే సీమాంధ్ర పార్టీ తెలుగుదేశం కుట్రలకు తెర లేపింది. ఎలాగైన కేసీఆర్ ను నిలవరించాలనుకుంటుంది. తెలుగు, తెలంగాణ నాయకున్ని గెలవకుండా చేయాలనే కుటిల ప్రయత్నం మొదలుపెట్టింది. సీఎన్‌ఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ఓటింగ్‌లో సీఎం కేసీఆర్ (31 శాతం ఓటింగుతో) ముందున్న విషయం తెలిసిందే. ఓటింగ్ నేటితో ముగియబోతోంది.

అంటే పి.విజయన్ (21 శాతం ఓటింగ్) వెనుకబడి ఉండటం వల్ల కేసీఆర్ గెలవటమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మార్పు. ఆంధ్రా పచ్చ పార్టీ తన కుటిల బుద్దిని బయటపెట్టిందంటూ తెలుగుదేశం పార్టీపై నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. కేసీఆర్ గెలిస్తే తమ ఉనికికే ప్రమాదమనుకుందని వ్యాఖ్యానించింది.
ఇంకా నమస్తే తెలంగాణ పత్రిక ఇలా రాసింది - ఇంకేముంది కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టింది. పి.విజయన్ కే ఓటు వేయమంటూ టీడీపీ ఆఫిషియల్ పేజీ నుంచి ఓ మెసేజ్‌ను సర్య్కులేట్ చేస్తుంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విషయంలో కూడా ఇదే విధంగా విషం చిమ్మిన విషయం ఎప్పటికీ మరవలేం. స్వరాష్ట్ర సాధనలో తన ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమనాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ కు దక్కిన అరుదైన గౌరవం ఇండియన్ ఆఫ్ ది ఇయర్ లో నామినేట్ కావడం.












Click it and Unblock the Notifications