వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు - 28న విచారణకు రావాలంటూ : ఆ కేసులోనే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28న కోర్టు ముందు హాజరు కావాలంటూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైఎస్ జగన్.. శ్రీకాంత్ రెడ్డి.. నాగిరెడ్డిపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో..ఏపీ ముఖ్యమంత్రికి సమన్లు జారీ చేసింది.

Recommended Video

AP CM Jagan కు Nampally Special Court సమన్లు తొలి సారి సీఎంగా ఉన్న నేతకు | Oneindia Telugu
సీఎం హోదాలో తొలి సారిగా

సీఎం హోదాలో తొలి సారిగా

ఈ కోర్టు సీఎం స్థాయిలో వ్యక్తికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేయటం ఇదే తొలి సారి. 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి వైసీపీ అభ్యర్ధి పోటీలో నిలిచారు. పార్టీ నుంచి గట్టు శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయగా..ఆ ఎన్నికల్లో ఆయనకు 29,692 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అయితే, సంబంధింత అధికారుల నుంచి అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించారనేది జగన్ తో పాటుగా పార్టీ నేతల పైన ఫిర్యాదు నమోదైంది. ఈ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్-188, 143 కింద అప్పట్లోనే పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని


ఎంపీ..ఎమ్మెల్యేల కేసులు విచారించే ఈ ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంగా ఉన్న నేతకు సమన్లు జారీ చేయటం ఇదే తొలి సారి కావటంతో ఇది ఆసక్తి కరంగా మారుతోంది. గతంలో వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఇదే కోర్టులో విజయమ్మ..షర్మిల హాజరయ్యారు. ఇక, ఇప్పుడు సీఎం జగన్ కు నోటీసులు జారీ చేయటం పైన పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ సమన్ల పైన ఏపీ ప్రభుత్వం.. వైసీపీ నేతలు అధికారికంగా స్పందించలేదు. జగన్ హాజరు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆయన తరపున న్యాయవాదులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతల నుంచి అందుతున్న సమచారం.

2019 నుంచి తెలంగాణకు దూరంగా

2019 నుంచి తెలంగాణకు దూరంగా


2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన తరువాత వైసీపీ అటు ఏపీ..ఇటు తెలంగాణలోనూ పోటీ చేసింది. ఆ సమయంలో తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ తో పాటుగా ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఏపీలో 67 అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. అయితే, 2019 నుంచి పూర్తిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరమైంది. ఏపీ పైనే ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చింది. ఇక, తెలంగాణలో జగన్ తన సోదరి షర్మిల రాజకీయంగా ఎంట్రీ ఇవ్వటం పైన నో చెప్పారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు.


English summary
Nampally CBI court have summoned notices to AP CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X