టీమిండియాకు దొరికిన చిచ్చరపిడుగు
టీమిండియా టెస్ట్ క్రికెట్ కు మరో చిచ్చరపిడుగు దొరికాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే అదరగొట్టాడు. స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. ఫలితంగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో 152 పరుగులకు ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ఆడుతోంది. లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.
రాజస్థాన్‌కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడీ ఈ మ్యాచ్ తో. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆరు వికెట్లతో సంచలనం సృష్టించాడు. అతనికి ఇది డెబ్యూ మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను బేజారెత్తిస్తూ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కేవలం 152 పరుగులకే కుప్పకూల్చడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు.

భారత్ తన మొదటి ఇన్నింగ్స్ 564/8 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బంతిని సుతార్‌కు అందించారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే బౌలింగ్‌కు వచ్చిన సుతార్.. టెస్ట్ కెరీర్‌లో తాను వేసిన మొదటి ఓవర్‌లోనే నాలుగో బంతికి అబ్దుల్ మాలిక్‌ను ఔట్ చేసి తన రాకను ఘనంగా చాటాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సుతార్ స్పిన్ ధాటికి ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు.
ఈ అద్భుత ప్రదర్శనతో, టెస్ట్ క్రికెట్ అరంగేట్రంలోనే ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన పదో భారతీయ బౌలర్‌గా మానవ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ సుదీర్ఘ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 174 మంది బౌలర్లు మాత్రమే ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. అరంగేట్రంలో ఈ ఘనత సాధించిన వారిలో ఏడుగురు స్పిన్నర్లు ఉండటమే నిదర్శనం.
టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన భారతీయ బౌలర్ల జాబితాలో ఇప్పుడు సుతార్ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. గతంలో మహ్మద్ నిస్సార్ (1932), వామన్ కుమార్ (1961), సయ్యద్ అబిద్ అలీ (1967), దిలీప్ దోషి (1979), నరేంద్ర హిర్వానీ (1988), అమిత్ మిశ్రా (2008), రవిచంద్రన్ అశ్విన్ (2011), మహ్మద్ షమీ (2013), అక్షర్ పటేల్ (2021) ఈ అరుదైన ఫీట్ సాధించిన వారిలో ఉన్నారు. వారి సరసన చేరాడు మానవ్ సుతార్.
మొత్తంగా 6/33తో టెస్ట్ అరంగేట్రంలో భారత్ తరపున రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. 1988లో వెస్టిండీస్‌పై చెన్నైలో 8/61తో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ బౌలర్ నరేంద్ర హిర్వానీ రికార్డు తర్వాతి స్థానంలో సుతార్ నిలిచాడు.












Click it and Unblock the Notifications