అప్పుడలా.. ఇప్పుడిలా!: ఎమ్మెల్యే బాబూరావుకు బాలకృష్ణ చురక, నవ్వుకున్నారు!
అమరావతి: ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ప్రముఖ సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇటీవల చోటు చేసుకున్న సంఘటన అందరికీ నవ్వులు పంచాయి.

పేరు రాసిన ఎమ్మెల్యే..
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో బాబూరావు ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కు ఓటు వేశారు. కోవింద్ పేరు ఎదురుగా 1 అంకె వేసి, బ్యాలెట్ పేపర్ పైన తన పేరు రాశారు. ఆ తర్వాత తన పేరు రాశానని అధికారులకు చెప్పారు. దీంతో, మీ ఓటు మురిగిపోతుందని అధికారులు ఆయనకు తెలిపారు.

చేసేదేం లేక..
ఈ నేపథ్యంలో మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అధికారులను ఆయన కోరారు. ఇలా ఇవ్వడం కుదరదని ఆయనకు అధికారులు తెలిపారు. దీంతో ఆయన పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు.
Recommended Video


జాగ్రత్త పడ్డ మిగితా ఎమ్మెల్యేలు..
ఈ విషయం బయటకు పొక్కడంతో మిగితా ఎమ్మెల్యేలు జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ఓటు వేయడానికి వచ్చిన బాలకృష్ణకు కూడా తెలిసింది. దీంతో ఆయన బాబూరావుతో మాట్లాడారు.

నవ్వులు పూయించిన బాలయ్య...
‘2009 ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేయకపోవడంతో అప్పుడు మీ నామినేషన్ చెల్లలేదు. ఇప్పుడు ఈ ఎన్నికలో మీ పేరు రాసినందుకు మీ ఓటు చెల్లలేదు' అంటూ చురకంటించారు. దీంతో అక్కడున్నవారి ముఖాల్లో నవ్వులు విరిశాయి.












Click it and Unblock the Notifications