హిందూపురంపై వైసీపీ ఫోకస్-బాలయ్య అలర్ట్ -పెద్దిరెడ్డిని పంపుతున్న జగన్ ..!
ఏపీలో టీడీపీ కంచుకోటగా పేరు తెచ్చుకున్న హిందూపురం నియోజకవర్గం వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడ నందమూరి బాలకృష్ణను ఎలాగైనా ఓడించాలని ఈసారి పట్టుదలగా ఉన్న వైసీపీ.. మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దించబోతోంది. ఇప్పటికే ఇక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఇక్బాల్ ను మార్చి మరో మహిళా నేతకు అవకాశం ఇచ్చిన వైసీపీ.. బాలయ్య కంచుకోటను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఆయన అలర్ట్ అయ్యారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి హిందూపురంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ గా ఫోకస్ పెట్టారు.నేటి నుంచి హిందూపురంలో రెండు రోజులు పాటు మకాం వేయనున్న బాలయ్య.. మండలాల వారిగా ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఒక్కో మండలంతో ఒక్కోసారి సమావేశం ఉంటుందని, దీనికి మిగిలిన మండలాల వారిని రావద్దని ఆదేశించారు.

ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, స్థానికంగా ఉన్న అంశాలపై బాలకృష్ణ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నియోజకవర్గంలో అసంతృప్తులపై బాలయ్య దృష్టి పెట్టినట్లు సమాచారం. వారితో నేరుగా మాట్లాడి వచ్చే ఎన్నికల్లో మరోసారి తనకు మద్దతిచ్చేలా చూసుకునేందుకు బాలయ్య పావులు కదుపుతున్నారు. దీంతో వైసీపీ కూడా అలర్ట్ అవుతోంది.బాలయ్య కు చెక్ పెట్టేందుకు అధిష్టానం దూతగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగబోతున్నారు.
మూడు రోజుల తర్వాత అంటే క్రిస్మస్ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో పర్యటిస్తారని తెలుస్తోంది. స్ధానికంగా ప్రకటించిన మహిళా ఇన్ ఛార్జ్ కు మద్దతుగా స్ధానిక రాజకీయాల్ని మార్చేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేయబోతున్నారు. దీంతో వరుస పరిణామాలతో హిందూపురం రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.












Click it and Unblock the Notifications