కోట్లకు పడగలెత్తిన మట్కా బీటర్! నా ఇలాకాలో ఇలానా?: బాలయ్య సీరియస్

Subscribe to Oneindia Telugu
  కోట్లకు పడగలెత్తిన మట్కా బీటర్! బాలయ్య ఇలానా?: Huge Matka Beaters Activities In Hindupur | Oneindia

  అనంతపురం‌: ఓ మీడియాలో వచ్చిన కథనంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. హిందూపురంలో ఓ మట్కా నిర్వాహకుడు రూ.కోట్లకు పడుగలెత్తి సినీరంగంలోకి అడుగిడినట్లు ఓ తెలుగు పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరా తీసినట్లు తెలిసింది.

  ఆరా తీసిన బాలయ్య

  ఆరా తీసిన బాలయ్య

  సామాన్య జీవితం గడుపుతూ మట్కా బీటరుగా అవతారమెత్తిన వ్యక్తి.. అనతికాలంలోనే ఓ పోలీస్‌ అధికారి అండదండలతో రూ.కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. అంతేగాక, అతడు ఓ సినిమా కూడా తీస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాలపై జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేతతో ఫోన్‌ ద్వారా బాలకృష్ణ ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  ఇంత పెద్ద మొత్తంలోనా..?

  ఇంత పెద్ద మొత్తంలోనా..?

  తన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మట్కా జరుగుతోందా? అని బాలకృష్ణ ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఓ పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడి స్థానిక పోలీసు అధికారుల పనితీరుపై చర్చించినట్లు జిల్లాకు చెందిన ముఖ్యనేత తెలిపారు.

  హెచ్చరిక

  హెచ్చరిక

  ఈ నేపథ్యంలో మట్కా వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ పోలీసు అధికారులను సీరియస్‌గా హెచ్చరించినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం టెలికాన్ఫెరెన్స్‌ సందర్భంగా అనంతపురంలో జరుగుతున్న మట్కాపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

  మట్కా బీటర్ల పరార్

  మట్కా బీటర్ల పరార్

  ఈ క్రమంలో కొంతమంది మట్కా బీటర్లు పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పరారయినట్లు తెలుస్తోంది. జిల్లా కేం ద్రంలో ఉన్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులు ‘మట్కా కింగ్‌' ఎక్కడు న్నాడు అనే విషయమై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అతడికి స్థానిక పోలీసులు, రాజకీయ నేతలు కూడా సహకరిస్తున్నారా? అనే కోణంలోనూ ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  MLA Nandamuri Balakrishna serious on huge matka beaters activities in Hindupur.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X