బావకు బెయిల్ కోసం ఆ పవర్ ఫుల్ ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు.. ఫలించాయా?
అమరావతి: కోట్లాది రూపాయల విలువ చేసే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరయింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల పాటు మాత్రమే చెల్లుబాటయ్యే బెయిల్ ఇది.
ఈ నాలుగు వారాల్లోగా చంద్రబాబు తన కంటికి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. బెయిల్ పొందుపరిచిన షరతుల ప్రకారం.. మళ్లీ ఆయన నవంబర్ 23వ తేదీ నాటికి సరెండర్ కావాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు 52 రోజుల తరువాత బెయిల్ మంజూరయింది.. అదికూడా షరతులతో.

అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానానికి అభ్యర్థించారు. దీనిపై ఇదివరకే ఓ అనుబంధ బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేశారు. గతంలో ఆయన కంటికి ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు మరోసారి దాన్ని సమీక్షించాల్సి ఉందని వాదించారు.
వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏపీ హైకోర్టు ధర్మాసనం.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ లభించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోన్నారు. హైదరాబాద్, గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు.
చంద్రబాబుకు బెయిల్ లభించడానికి ముందు రోజే.. ప్రముఖ నటుడు, టీడీపీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తమిళనాడులోని ఓ ప్రఖ్యాత ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు.
అది- తిరునాగేశ్వరం నాగనాథ ఆలయం. నవగ్రహాల్లో ఒకటైన రాహు స్థలంగా దీన్ని భావిస్తారు. శివ పార్వతుల ఆలయం ఇది. అత్యంత ప్రాచీనమైనది. ఏడో శతాబ్దంలో నిర్మితమైంది. నాగనాథుడిగా మహా శివుడు, గిరి గుజాంబిగై, పిరైసూడి అమ్మన్‌గా పార్వతి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటుంటారు. తంజావూరు జిల్లాలోని కుంభకోణం శివార్లలో ఉంటుంది ఈ ఆలయం.
తమిళనాడులోని శక్తిమంతమైన ఆలయాల్లో దీన్నీ ఒకటిగా భావిస్తుంటారు భక్తులు. అలాంటి ఆలయాన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నాగనాథుడు, అమ్మవారి సేవలో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫొటోలు దిగారు.
ఈ ఆలయాన్ని సందర్శించిన మరుసటి రోజే చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకుంటోన్నారు. బాలకృష్ణ పూజలు ఫలించాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తారని చెబుతున్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications