తెలుగువారు గర్వపడేలా జగన్ నిర్ణయం: కృతజ్ఞతలు తెలిపిన నందమూరి కుటుంబం..
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటరీ నియోజకర్గాన్ని జిల్లాగా మరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఉగాది నాటికి ఈ ప్రక్రియను అంతా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా.. మరికొన్ని చోట్ల స్వాగతిస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు దివంగత మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ( ఎన్టీఆర్ ) పేరును ఖరారు చేసింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది.. పురందేశ్వరి
తాజాగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరును నామకరణం చేయడంపై నందమూరి కుటుంబం స్వాగతించింది. ఎన్టీఆర్ కుమార్తె , మాజీ మంత్రి , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆయన బిడ్డగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది. జై ఎన్టీఆర్!!! అంటూ పురందేశ్వరి ట్విట్ చేశారు.

ప్రతి తెలుగువాడు గర్వపడేలా ప్రభుత్వ నిర్ణయం
అటు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రాంతాలు వేరైనా తెలుగు బిడ్డలంతా ఒక్కటేనని చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి తెలుగువాడు గర్వపడేలా జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సంతోషకరమైందన్నారు. ఏపీ ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రామకృష్ట చెప్పారు.
Recommended Video

తెలంగాణలోనూ ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు.. కేసీఆర్‌కు విజ్ఞప్తి
మరోవైపు ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయడాన్ని సినీ నిర్మాత,దర్శకుడు వైవీఎస్ చౌదరి స్పందించారు. ఆత్మగౌరవ నినాదంతో తెలుగుజాతిలో చైతన్యాన్ని నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. తనకున్న బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో కాలుమోపిన అన్ని రంగాల్లో అఖండ విజయాలు సాధించారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను వైవీఎస్ చౌదరి కోరారు. ఎన్టీఆర్ శత జయంతిని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని ఆకాంక్షించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications