నాకూ ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్ ఆఫర్-ఈసారి బాంబు పేల్చిన వైసీపీ ఎమ్మెల్యే..!
కర్నూలు : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఎమ్మెల్యేలకు ఓటుకు నోటు ఆఫర్లు అందినట్లు అధికార వైసీపీ ఆరోపిస్తోంది. విపక్ష టీడీపీ నేతలు తమ పార్టీ వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు సజ్జల ఆరోపించారు. ఇదే ఆరోపణలతో తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు తమకు ఆఫర్లు అందాయని బయటపెడుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కోసం తనకూ ఆఫర్ అందినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం తనకూ ఆఫర్ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు తన కుమారునికి ఫోన్ చేశారని వెల్లడించారు. మా నాన్న ఒప్పుకోడని తన కుమారుడు తోసిపుచ్చారని తెలిపారు. ఇది ఇంతటితో ఆగలేదన్నారు.

పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలో తమ ఇంటివద్ద పర్సనల్ గా మాట్లాడాలని గన్‌మెన్ ను సంప్రదించారని కూడా ఎమ్మెల్యే ఆర్ధర్ ఆరోపించారు. గన్ మెన్ ఫోన్‌లో మాట్లాడిస్తే కర్నూలు త్రీ టౌన్ సీఐ వద్ద పని ఉందని, పర్సనల్‌గా మాట్లాడాలన్నారు. ఈ టైంలో ఎందుకు ఉదయమే రమ్మన్నానని తెలిపారు. పోలింగ్ కు ముందు మళ్లీ ఫోన్ చేశారని, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానని, పర్సనల్ గా మాట్లాడాలనంటే.. మీ ఆటలన్నీ తెలుసు అని వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే, రూ.200 కోట్లు ఓవైపు.. వైఎస్ జగన్ ఫొటో ఒకవైపు పెడితే.. తాను జగన్ ఫోటోనే తీసుకుంటా అని చెప్పానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications