నంద్యాలలో సైకిల్ జోరు, టిడిపి సంబరాలు: జగన్‌పై అఖిలప్రియ విమర్శలు

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి దూసుకెళ్తోంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టిడిపికి 17వేలకు పైగా మెజార్టీ వచ్చింది. దీంతో టిడిపి ఉత్సాహంతో ఉంది.

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి దూసుకెళ్తోంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టిడిపికి 17వేలకు పైగా మెజార్టీ వచ్చింది. దీంతో టిడిపి ఉత్సాహంతో ఉంది.

సంబరాల్లో మునిగి తేలుతోంది. టిడిపి గెలుపు దిశగా సాగుతున్న నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ మాట్లాడారు.

మాకు డిపాజిట్లు రావని చెప్పారు

మాకు డిపాజిట్లు రావని చెప్పారు

ఎవరైతే మాకు డిపాజిట్లు రావని చెప్పారో, వారు ఇప్పుడు ఓడిపోతున్నారని అఖిలప్రియ అన్నారు. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి తమ మెజార్టీ భారీగా ఉందని, మరింత మెజార్టీ వస్తుందని ఆమె చెప్పారు. తమను నమ్మి ప్రజలు ఓటు వేశారన్నారు. తన తండ్రిపై ప్రజలు అభిమానం చూపుతున్నారన్నారు.

Recommended Video

    Nandyal ByPolls Results Update : TDP Leading by Margin of 20,000 after 8 rounds | Oneindia Telugu
    చంద్రబాబుకు థ్యాంక్స్

    చంద్రబాబుకు థ్యాంక్స్

    నంద్యాల గెలుపు అంశంలో తాము చంద్రబాబుకు థ్యాంక్స్ చెబుతున్నామని అఖిలప్రియ అన్నారు. ఆయన వల్లే మాకు మెజార్టీ వచ్చిందని చెప్పారు. టిడిపి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు భూమా కుటుంబానికి అండగా నిలబడ్డారని, మాకు మద్దతు తెలిపారని అఖిలప్రియ అన్నారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు.

    చాలా సీరియస్‌గా తీసుకున్నాం

    చాలా సీరియస్‌గా తీసుకున్నాం

    తన తండ్రి భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలను తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని అఖిలప్రియ చెప్పారు. వాటిని నెరవేర్చుతున్నామని అన్నారు. ఓటుతో ప్రజలు తమకు ఆశీర్వాదం ఇచ్చారని తెలిపారు. ఆళ్లగడ్డ, నంద్యాలలు తనకు తల్లిదండ్రులతో సమానమని చెప్పారు.

    ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు

    ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు

    తాము ఉప ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని వైసిపి చేస్తున్న ఆరోపణలను అఖిలప్రియ కొట్టి పారేశారు. తాము రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, అవి కాకుండా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.

    ఎవరు తప్పుడు ప్రచారం చేసినా

    ఎవరు తప్పుడు ప్రచారం చేసినా

    ఎవరు తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు వైసిపికి, ఆ పార్టీ అధినేత జగన్, ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని అఖిలప్రియ విమర్శించారు. తమకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+