భూమాకు ఆశ చూపి ఇలా చేశారు: బాబుపై అంబటి, 'సంప్రదాయ' యుద్ధం
నంద్యాల సీటు ఎప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 2014లో నంద్యాల సీటును తమ పార్టీ గెలుచుకుందని చెప్పారు.
నంద్యాల: నంద్యాల సీటు ఎప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 2014లో నంద్యాల సీటును తమ పార్టీ గెలుచుకుందని చెప్పారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం టిడిపి ఆత్రుత ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఇస్తున్న హామీలు ప్రజలను మభ్య పెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు.

కొండమీది కోతిని తెచ్చేందుకు సిద్ధంగా
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు కొండ మీది కోతిని తెచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అంబటి ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని దుష్ట, దౌర్భాగ్య చరిత్ర ఆయనదే అన్నారు.
Recommended Video


భూమాకు పదవి ఆశ చూపించారు
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరితే పదవి ఇస్తామని ఆశ చూపించారని, పార్టీ మారిన తర్వాత ఆయనకు ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారని అంబటీ తీవ్ర ఆరోపణలు చేశారు. భూమాను మోసం చేసిన చంద్రబాబు.. నంద్యాల ప్రజలను మోసం చేయలేరా అని ప్రశ్నించారు.

వైసిపి సెంటిమెంట్
నంద్యాలలో భూమాకు పెద్ద అనుచరగణం ఉంది. ఈ నేపథ్యంలో భూమా సెంటిమెంటును వైసిపి కూడా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు అంబటి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అందులో భాగంగానే భూమాను మోసం చేసిన చంద్రబాబు.. నంద్యాల ప్రజలను మోసం చేయలేరా అని ప్రశ్నించారు.

సంప్రదాయంపై బాబుకు కౌంటర్
చంద్రబాబు నీతులు పల్లె వేస్తున్నారని మరో నేత కన్నబాబు అన్నారు. భూమా చనిపోయేంత వరకు వైసిపి ఎమ్మెల్యే అని, ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అదే పార్టీకి వదిలేసే సంప్రదాయం ఉందని కన్నబాబు టిడిపికి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబే సంప్రదాయానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications